hyderabadupdates.com Gallery అంచ‌నాలు పెంచుతున్న జైల‌ర్ -2 చిత్రం

అంచ‌నాలు పెంచుతున్న జైల‌ర్ -2 చిత్రం

అంచ‌నాలు పెంచుతున్న జైల‌ర్ -2 చిత్రం post thumbnail image

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన అరుదైన న‌టుడు ర‌జనీకాంత్. త‌ను న‌టిస్తున్న తాజా సీక్వెల్ చిత్రం జైల‌ర్ -2 మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త‌లైవా వెల్ల‌డించ‌డం విశేషం. ఇదే చిత్రానికి సంబంధించి మ‌రో కీల‌క‌మైన స‌న్నివేశం చిత్రీక‌రించాల్సి ఉంద‌ని, వ‌చ్చే ఆగ‌స్టు నెల‌లో షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని పేర్కొన్నారు త‌లైవా . సినీ పరిశ్రమలోని మరో దిగ్గజం కమల్ హాసన్‌తో కలిసి చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి కూడా రజనీకాంత్ ఒక కీలకమైన అప్‌డేట్‌ను అందించారు. ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాణ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని సూపర్ స్టార్ తెలిపారు; దీంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
ఆదివారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు త‌లైవా ర‌జ‌నీకాంత్. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ‘జైలర్’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సీక్వెల్ రూపొందుతోందని చెప్పారు. ‘జైలర్ 2’ విషయంతో పాటు, సినీ పరిశ్రమలోని మరో దిగ్గజం కమల్ హాసన్‌తో కలిసి చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి కూడా రజనీకాంత్ ఒక కీలకమైన అప్‌డేట్‌ను అందించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా, తమిళ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన ఇద్దరు దిగ్గజాలు ఒకే తెరపైకి రానున్నారని భావిస్తున్నారు. రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు 2026లో ప్రారంభం కానుందన్నారు ర‌జ‌నీకాంత్. ఫిబ్రవరిలో విడుదలైన ఒక ప్రోమో వీడియోలో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ , సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ల విలక్షణ శైలిని ప్రదర్శించడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే భారీ స్థాయిలో ఆసక్తి ఏర్పడింది.
The post అంచ‌నాలు పెంచుతున్న జైల‌ర్ -2 చిత్రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్కVruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క

    వృక్షమాతగా గుర్తింపు పొందిన ‘సాలుమరద’ తిమ్మక్క (114) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె… బెంగళూరు జయనగరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆమె దత్తపుత్రుడు ఉమేశ్‌ వెల్లడించారు. వివాహమైన తర్వాత పాతికేళ్లయినా సంతానం

KTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లుKTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లు

  ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని దానం నాగేందర్‌ను స్టార్‌ క్యాంపెయినర్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్‌ దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ ను నిలదీశారు.

సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదంసోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదం

న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీయే స‌ర్కార్ సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌ను నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకున్న ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర‌షాల ద్వ‌యం మ‌రోసారి త‌మ‌కు