hyderabadupdates.com Gallery ఆర్బీఐ రెపో రేట్ 5.25 య‌థాత‌థం

ఆర్బీఐ రెపో రేట్ 5.25 య‌థాత‌థం

ఆర్బీఐ రెపో రేట్ 5.25 య‌థాత‌థం post thumbnail image

ముంబై : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బుధ‌వారం ఈ మేర‌కు వివ‌రాలు వెల్ల‌డించింది. ఆర్‌బిఐ రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు తటస్థ వైఖరిని కొనసాగించేందుకే బోర్డు మొగ్గు చూపింద‌న్నారు. ఇవాళ సంజయ్ మ‌ల్హోత్రా మీడియాతో మాట్లాడారు. పాలసీ రెపో రేటు 5.25 శాతంగా యథాతథంగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. కేంద్ర బ్యాంక్ తటస్థ ద్రవ్య విధాన వైఖరిని కొనసాగిస్తుందని ప్రకటించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి ద్రవ్య విధాన సమీక్షలో ప్రసంగించారు. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు వంటి అపూర్వమైన సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ స్ప‌ష్టం చేశారు. పశ్చిమ ఆసియా సంఘర్షణలో తాత్కాలిక కాల్పుల విరమణను ఈ రోజు ప్రారంభంలోనే ప్రకటించినట్లు సంజ‌య్ మ‌ల్ హోత్రా పేర్కొన్నారు.
కాగా ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ, పశ్చిమ ఆసియా సంక్షోభం తీవ్రతరం కావడానికి ముందు ఉన్న బలమైన వృద్ధి, సాపేక్షంగా తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా భారతదేశ స్థూల ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్. ఇదిలా ఉండ‌గా రాబోయే రోజులలో రెపో రేట్ త‌గ్గించే ప్ర‌మాదం లేక పోలేద‌ని వ్యాపార‌, వాణిజ్య వ‌ర్గాలు భావిస్తున్నాయి.
The post ఆర్బీఐ రెపో రేట్ 5.25 య‌థాత‌థం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రంకోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం

అనంతపురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఆమె ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌న‌మిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. జాతీయ ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాల‌ని

బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలిబీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

అమరావతి : బీసీ హాస్టళ్లపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మరో రెండు నెలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని, ఈలోగా హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్

9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి

న్యూఢిల్లీ : ప్ర‌స్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న యుద్ద వాతావ‌ర‌ణ కార‌ణంగా ప‌లు విమానాల రాక పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంది. ఈ త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది డీజీసీఏ. శుక్ర‌వారం విమాన‌యాన సంస్థ‌ల‌కు