hyderabadupdates.com Gallery ఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా తీర్చిదిద్దుతాం

ఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా తీర్చిదిద్దుతాం

ఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా తీర్చిదిద్దుతాం post thumbnail image

న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా మారుస్తామ‌ని అన్నారు. శుక్ర‌వారం న్యూఢిల్లీలో జ‌రిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ప‌లు కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సదస్సులో ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌళిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా ఏడు ఒప్పందాలు చేసుకున్నారు. ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం, అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఎంఓయూలు కుదుర్చుకున్నారు.
భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ-క్వాంటం రంగాల్లో శిక్షణ, ప్రభుత్వ శాఖల్లో ఏఐ-క్వాంటం వినియోగం, టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాల‌ని నిర్ణ‌యించింది. ఏఐ-క్వాంటం డిజిటిల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను తీర్చిదిద్దేలా ప్రణాళికలు త‌యారు చేశామ‌ని పేర్కొన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం కార్యక్రమానికి హాజరైన యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్ సహా ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
The post ఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా తీర్చిదిద్దుతాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లుశ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు

తిరుపతి/ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా

Afghanistan: అఫ్గాన్ మంత్రి ప్రెస్‌మీట్‌ లో మహిళలపై ‘నిషేధం’ ఆరోపణపై స్పందించిన కేంద్రంAfghanistan: అఫ్గాన్ మంత్రి ప్రెస్‌మీట్‌ లో మహిళలపై ‘నిషేధం’ ఆరోపణపై స్పందించిన కేంద్రం

Afghanistan: దేశరాజధాని ఢిల్లీలో అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ (Amir Khan Muttaqi) ఏర్పాటుచేసి మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో ఉద్దేశపూర్వకంగానే మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారంటూ విపక్ష

సంజూ శాంస‌న్ క్లాస్ శాశ్వ‌తం : శ‌శి థ‌రూర్సంజూ శాంస‌న్ క్లాస్ శాశ్వ‌తం : శ‌శి థ‌రూర్

కేర‌ళ : త‌మ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పై స్పందించారు తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్. ఆదివారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. తాజాగా స్వ‌దేశంలో న్యూజిలాండ్ జ‌ట్టుతో జ‌రిగిన టి20