hyderabadupdates.com Gallery ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం భారీ ఊతం

ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం భారీ ఊతం

ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం భారీ ఊతం post thumbnail image

న్యూఢిల్లీ/అమరావతి: కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నిధుల సాధనే లక్ష్యంగా, అభివృద్ధి పనుల ఆమోదమే మార్గంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆయన నివాసంలో మంత్రి దుర్గేష్ కలిశారు. ఈ కీలక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో ఐకానిక్ పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక సర్క్యూట్‌ల బలోపేతం కోసం మంత్రి కందుల దుర్గేష్ చేసిన విన్నపాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక మౌలిక సదుపాయాల బలోపేతానికి రూ. 915 కోట్ల విలువైన 9 కొత్త ప్రాజెక్టులతో పాటు, తెలుగు భాష , కళల పరిరక్షణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 6 కీలక సాంస్కృతిక ప్రాజెక్టులపై చర్చించగా కేంద్రం సానుకూలంగా స్పందించింది.
గతంలో మంత్రి కందుల దుర్గేష్ చేసిన కృషి ఫలితంగా శాస్కి, ప్రసాద్, స్వదేశీ దర్శన్, సిబిడిడి వంటి పథకాల కింద రాష్ట్రానికి ఇప్పటికే మంజూరైన 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ. 430 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వాటి పురోగతిని వివరించి త్వరితగతిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మంత్రి దుర్గేష్ ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందిస్తూ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మేరకు కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఆర్థిక చోదక శక్తిగా మార్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
The post ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం భారీ ఊతం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్

హైద‌రాబాద్ : ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేక కొత్త దుకాణం మొద‌లు పెట్టారంటూ కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు

ఫ‌స్ట్ పోస్ట్ నుంచి వైదొలిగిన పాల్కీ శ‌ర్మ‌ఫ‌స్ట్ పోస్ట్ నుంచి వైదొలిగిన పాల్కీ శ‌ర్మ‌

ముంబై : ఇండియాకు చెందిన అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన జ‌ర్న‌లిస్టు పాల్కీ శ‌ర్మ ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు . తాను ఫ‌స్ట్ పోస్ట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా

‘వ‌ర‌ల‌క్ష్మీ న‌వీన్ చంద్ర’ ల‌వ్ సాంగ్ వైర‌ల్‘వ‌ర‌ల‌క్ష్మీ న‌వీన్ చంద్ర’ ల‌వ్ సాంగ్ వైర‌ల్

హైద‌రాబాద్ : సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమాలో