hyderabadupdates.com Gallery క‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగం

క‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగం

క‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగం post thumbnail image

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం భక్తి భరితంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి, నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది.తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళం వంటి పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి.
ప్రకృతి వైపరీత్యాలు తొలగి భక్తులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారు. అలాగే నిత్యకైంకర్యాలలో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ యాగాన్ని చేస్తారని అర్చకులు తెలిపారు. ఈ యాగం ద్వారా దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఈసారి ఒంటిమిట్ట‌లో నిర్వ‌హించిన వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు నిన్న‌టితో ధ్వ‌జారోహ‌ణంతో ముగిశాయి. ఈ సంద‌ర్బంగా చేప‌ట్టిన శ్రీ కోదండ రాముడి క‌ళ్యాణోత్స‌వానికి రికార్డు స్తాయిలో భ‌క్తులు హాజ‌ర‌య్యారు. స్వామి అమ్మ‌వార్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, కుటుంబీకులు ప‌ట్టు వస్త్రాలు స‌మ‌ర్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు సదాశివ రావు, డిప్యూటీ ఈవో ప్రశాంతి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The post క‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నిజ‌మైన మ‌హాత్ముడు జ్యోతిబా పూలే : మోదీనిజ‌మైన మ‌హాత్ముడు జ్యోతిబా పూలే : మోదీ

న్యూఢిల్లీ : ఈ దేశంలో నిజ‌మైన మ‌హాత్ముడు ఒకే ఒక్క‌డు జ్యోతిబా పూలే అని కొనియాడారు ప్ర‌ధాని మోదీ. ఇవాళ పూలే జ‌యంతి సంద‌ర్బంగా రాష్ట్ర‌ప‌తి ముర్ముతో పాటు ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, ప్ర‌ముఖులు ఢిల్లీలో పూలే

కండ‌రాల గాయం ప‌లు మ్యాచ్ ల‌కు ధోనీ దూరంకండ‌రాల గాయం ప‌లు మ్యాచ్ ల‌కు ధోనీ దూరం

చెన్నై : ఐపీఎల్ 2026 మార్చి 28 శ‌నివారం నుండి ప్రారంభం కానుంది. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి బిగ్ షాక్ త‌గిలింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు. ఒక ర‌కంగా త‌మిళ క్రికెట్ అభిమానుల‌కు కోలుకోలేని దెబ్బ

Delhi High Court: ఉమ్మడి నివాసంలో కోడలికి నివసించే హక్కుంటుంది – ఢిల్లీ హైకోర్టు Delhi High Court: ఉమ్మడి నివాసంలో కోడలికి నివసించే హక్కుంటుంది – ఢిల్లీ హైకోర్టు 

    కుటుంబ కలహాల కారణంగా తమ ఆస్తిపై కుమారుడికి హక్కు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వారి ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు కోడలికి (కుమారుడి భార్యకు) ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంతో అత్తగారింట్లోకి అడుగుపెట్టి