hyderabadupdates.com movies కమల్ హీరో… రజినీ విలన్?

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే కాక దక్షిణాది సినీ ప్రేక్షకులందరినీ ఎంతో ఉత్సాహానికి, ఉద్వేగానికి గురి చేస్తోంది. కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్, జైలర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.

నిన్న రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రోమో భలేగా అనిపించింది.రజినీ, కమల్ మంచి మిత్రులైనప్పటికీ.. వారి మధ్య దశాబ్దాలుగా వృత్తిపరమైన పోటీ ఉంది. అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ సంగతీ చెప్పాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ప్రోమోలో ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు వ్యవహరించారు. అసలీ సినిమాలో హీరో ఎవరో చెప్పాలంటూ ఇద్దరు దర్శకుడు నెల్సన్‌ను ఇరుకున పెట్టేలా ప్రశ్నలు కూడా సంధించారు. కానీ ఆ ప్రశ్నకు ప్రోమోలో జవాబు మాత్రం ఇవ్వలేదు.

ఐతే ఈ చిత్రంలో రజినీకాంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుండొచ్చు అనే చర్చ జరుగుతోంది. రజినీ, కమల్ ఇద్దరూ నెగెటివ్ రోల్స్ చేయడంలో ఎవరికి వాళ్లే సాటి. కెరీర్ ఆరంభంలో రజినీ విలన్ పాత్రలు చాలానే చేశాడు. ‘రోబో’ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా పండించాడు.

ఇక కమల్ ‘అభయ్’ సినిమాలో హీరోగా, విలన్‌గా నటించాడు. ‘కల్కి’ చిత్రంలోనూ విలన్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఐతే కమల్‌ను మించి రజినీనే నెగెటివ్ క్యారెక్టర్‌ను బాగా చేయగలడన్నది స్పష్టం. అందుకే ఆయన పాత్రను కొంచెం నెగెటివ్ షేడ్స్‌తో తీర్చిదిద్ది ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రోమోలో ముందుగా కమల్‌ను చూపించి, పేరు కూడా తనదే ముందు వేయడం కూడా ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఐతే బాల నటుడిగా ఐదేళ్ల వయసు నుంచే సినిమాలు చేయడం ద్వారా నటనలో రజినీ కంటే కమలే సీనియర్ కాబట్టి ఆయన పేరు ముందు వేసి ఉండొచ్చు, ఆయన్నే ముందు చూపించి ఉండొచ్చని.. అంతమాత్రాన ఆయనే హీరో అని.. రజినీ విలన్ అని ఒక అభిప్రాయానికి రావడం కూడా కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తోంది.

ఐతే ప్రోమో ద్వారా మూవీలో ఒక్కరే హీరోనా.. లేక ఇద్దరూ హీరోలుగానే కనిపించనున్నారా అనే చర్చను లేవనెత్తి ఈ సినిమాకు ఆరంభంలోనే కావాల్సినంత బజ్ తీసుకొచ్చాడు నెల్సన్.

Related Post

Dhurandhar Is a Wake-Up Call for Indian Cinema: Ram Gopal Varma’s Sharp TakeDhurandhar Is a Wake-Up Call for Indian Cinema: Ram Gopal Varma’s Sharp Take

Veteran filmmaker Ram Gopal Varma has sparked a fresh debate in film circles with his powerful observations on Dhurandhar, calling the film a turning point and a warning to the

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతరమొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీని ముగించింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా

జనం నాడి పట్టుకున్న కూటమి.. పండుగ పూట ఖుషీ..!జనం నాడి పట్టుకున్న కూటమి.. పండుగ పూట ఖుషీ..!

ఏ ప్రభుత్వమైనా పట్టు విడుపులు ఉండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. అన్నీ చట్టం ప్రకారమే చేయాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి. ప్రజలు కూడా హర్షించరు. పైగా ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీలో ప్రభుత్వం