hyderabadupdates.com movies కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత రాజమౌళి ‘బాహుబలి’దే. మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ సైతం.. తన కలల సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ను తెరకెక్కించడానికి రాజమౌళి ‘బాహుబలి’నే స్ఫూర్తి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కోవలోనే మరెన్నో భారీ చిత్రాలు తెరకెక్కాయి.

బాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా సైతం మహాభారతంలో కల్ట్ క్యారెక్టర్ అయిన కర్ణుడి మీద సినిమా తీయడానికి చాలా ఏళ్ల ముందే ప్రణాళికలు రచించాడు. తమిళ స్టార్ హీరో సూర్యతో ఈ సినిమా చేయాలనుకున్నాడు. విక్రమ్ హీరోగా ‘మహావీర కర్ణ’ అనే సినిమా అనౌన్స్ అయినా సరే.. అతను వెనక్కి తగ్గలేదు. కానీ అటు విక్రమ్ సినిమా ముందుకు కదల్లేదు. అలాగే సూర్య చిత్రమూ పట్టాలెక్కలేదు.

కర్ణ సినిమా కోసం ఆరేళ్ల పాటు కష్టపడ్డట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాకేష్ వెల్లడించాడు. స్క్రిప్టుతో పాటు ప్రి ప్రొడక్షన్ మొత్తం పూర్తయిందన్నాడు. అంతే కాక మామూలుగా పాటల కోసం చాలా టైం తీసుకుని, రిలీజ్ ముందు వరకు ఇబ్బంది పెట్టే ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం ఆరు పాటలను ఎప్పుడో కంపోజ్ చేసినట్లు రాకేష్ వెల్లడించడం విశేషం.

ఐతే ఇంత కష్టపడ్డాక దురదృష్టవశాత్తూ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోయామని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐతే ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదన్నాడు. అది హోల్డ్‌లో మాత్రమే పడిందని.. కచ్చితంగా సినిమా ముందుకు కదులుతుందని.. ప్రస్తుతం రెహమాన్ ఆల్రెడీ కంపోజ్ చేసిన పాటకు మెరుగులు దిద్దుతున్నాడని చెప్పాడు.

తన ఊహల్లో కర్ణ పాత్రకు సూర్య తప్ప ఇంకొకరు కనిపించలేదని.. కాబట్టి ఎప్పటికైనా సూర్యతోనే ఆ కథను తెరకెక్కిస్తానని చెప్పాడు రాకేష్. బహుశా ఈ చిత్రానికి బడ్జెట్టే పెద్ద సమస్యగా మారి ఉండొచ్చు. కొన్నేళ్లుగా సూర్య మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. ఇప్పుడు చేస్తున్న చిత్రాలతో అతను పుంజుకుంటే, అన్నీ వర్కవుట్ చేసి సినిమాను ముందుకు తీసుకెళ్తారేమో చూడాలి.

Related Post

OTT Alert: Super Hit ‘Little Hearts’ Arrives on ETV Win with a SurpriseOTT Alert: Super Hit ‘Little Hearts’ Arrives on ETV Win with a Surprise

No one would have expected that a small movie like Little Hearts, featuring young cast members Mouli Tanuj Prashanth and Shivani Nagaram, and directed by debutant Sai Marthand, would make

టీ – స్థానికంలో టీడీపీ రోల్ ఏంటి?టీ – స్థానికంలో టీడీపీ రోల్ ఏంటి?

ఏపీ అధికార పార్టీ.. టీడీపీ వ్యూహం ఏంటో తెలియక తెలంగాణలో ఎదురు చూస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకులు లబోదిబోమంటున్నారు. చాలా మంది పార్టీలు మారినా, కొందరు అత్యంత నమ్మకంతో, అన్నగారి హయాం నుంచి ఉన్న కుటుంబాలు కూడా పార్టీలో కొనసాగుతున్నాయి.