hyderabadupdates.com Gallery కోకో సాగు ద్వారా రైతన్నల‌కు అధిక ఆదాయం

కోకో సాగు ద్వారా రైతన్నల‌కు అధిక ఆదాయం

కోకో సాగు ద్వారా రైతన్నల‌కు అధిక ఆదాయం post thumbnail image

ఏలూరు జిల్లా : కోకో సాగు ద్వారా రైత‌న్న‌ల‌కు అత్య‌ధిక ఆదాయం ల‌భిస్తోంద‌ని అన్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. శుక్ర‌వారం ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించి ప్ర‌సంగించారు అచ్చెన్నాయుడు. కోకో సాగు రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంటగా అభివృద్ధి చెందుతోంద‌ని చెప్పార‌రు. కోకో సాగు విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక సాగు విధానాలపై ఈ కాంక్లేవ్‌లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు. కోకో ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత లాభాలు సాధ్యమవుతాయని అఅన్నారు మంత్రి అచ్చెన్నాయుడు . ప‌నిలో ప‌నిగా రైతులకు నిపుణుల సలహాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు.
ఈ సంద‌ర్బంగా అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కోకో సాగు ఉత్పత్తి, నాణ్యత పెంపుతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్‌కు అనుసంధానం కల్పిస్తామని హామీ ఇచ్చారు .కోకో రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని స్ప‌ష్టం చేశారు. కోకో అభివృద్ధితో ఉద్యానవన రైతుల ఆర్థిక స్థితి మరింత మెరుగు పడుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు అచ్చెన్నాయుడు. గ‌తంలో కొలువు తీరిన వైసీపీ జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ రైతుల‌ను పూర్తిగా విస్మ‌రించింద‌ని ఆరోపించారు. దీంతో వ్య‌వ‌సాయ రంగం మ‌రింత తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోయింద‌ని, ప్ర‌స్తుతం తాము వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి. త‌మ ప్ర‌భుత్వం రైతుల‌కు నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువుల‌ను , ప‌నిముట్టు ప‌రిక‌రాల‌ను అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామ‌న్నారు.
The post కోకో సాగు ద్వారా రైతన్నల‌కు అధిక ఆదాయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?

Harinarayan Singh : అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అనేది ప్రత్యేకమే. మన దేశంలో ఇలా 10 కంటే ఎక్కువ సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. బిహార్‌లోనూ అలాంటి సీనియర్‌ మోస్ట్‌ నేతలు ఉన్నప్పటికీ… ఇంతవరకూ ఎవరూ

అభివృద్దికి న‌మూనా ప్ర‌జా పాల‌న : సీఎంఅభివృద్దికి న‌మూనా ప్ర‌జా పాల‌న : సీఎం

ఖ‌మ్మం జిల్లా : వైరా ప‌ట్ట‌ణం అభివృద్ది కోసం రూ. 200 కోట్లు మంజూరు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైరా పట్టణంలో భారీ ర్యాలీ మరియు కార్నర్ మీటింగ్‌ నిర్వహించడం జరిగింది.

స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పున‌రుద్ధ‌రిస్తాంస‌రూర్‌న‌గ‌ర్ చెరువును పున‌రుద్ధ‌రిస్తాం

హైద‌రాబాద్ : స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో త్వ‌ర‌లోనే ప‌నులు చేప‌డ‌తామ‌ని చెప్పారు. 140 ఎక‌రాల‌కు పైగా ఉన్న చెరువు ప‌రిధిలో చాలా వ‌ర‌కు నివాసాలు