hyderabadupdates.com Gallery ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే

ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే

ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే post thumbnail image

ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ‌ను రేపింది ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ కు జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌. చివ‌ర‌కు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోటీ నెల‌కొంది. కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈ కీల‌క ప‌ద‌విని కైవ‌సం చేసుకోవ‌డం విశేషం. విచిత్రం ఏమిటంటే భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ అనూహ్యంగా బీజేపీకి మ‌ద్ద‌తు తెలిపింది. రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. గులాబీ పార్టీ ఇచ్చిన స‌పోర్ట్ తో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు బీజేపీకి చెందిన అంకం మౌనిక. వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షోయబ్ ఎన్నిక‌య్యారు.
దీంతో ఆదివారం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ ఈ పదవిని దక్కించు కోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వికి సంబంధించి త‌మ పార్టీకి చెందిన మ‌హిళ‌కు మ‌ద్ద‌తు గ‌నుక ఇస్తే తాము వైస్ చైర్మ‌న్ ప‌ద‌వికి బేష‌ర‌తుగా స‌పోర్ట్ చేస్తామంటూ బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ క‌మ‌లం ప్ర‌తిపాద‌న‌కు గులాబీ ఓకే చెప్పింది.
12 మంది సభ్యులు కలిగిన ఈ మున్సిపల్ కౌన్సిల్‌లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించ లేదు. బీఆర్ఎస్ , బీజేపీ చెరో నాలుగు స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు స్థానాలు, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి మద్దతు, ఒక ఎక్స్-అఫిషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. అయితే బీఆర్ఎస్ తన మద్దతును బీజేపీకి ప్రకటించడంతో, రాజకీయ సమీకరణాలు బీజేపీకి అనుకూలంగా మారాయి.
The post ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలి : సీఎంపోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలి : సీఎం

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన చోట పోలీస్ సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సైబర్ క్రైమ్, మనీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలను అప్రమత్తం చేసేలా విశాఖ పోలీసులు

కొత్త రాజ‌ధాని తీర్మానం స‌రే కేంద్రం నిధుల మాటేంటి..?కొత్త రాజ‌ధాని తీర్మానం స‌రే కేంద్రం నిధుల మాటేంటి..?

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు ఏపీ కూట‌మి స‌ర్కార్ పై. శ‌నివారం అమ‌రావ‌తి రాజ‌ధానిగా చేయాల‌ని కోరుతూ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో శాస‌న స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. దీనికి ఆమోదం

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ సీట్లు భారీగా పెర‌గొచ్చుఏపీలో అసెంబ్లీ, లోక్ సభ సీట్లు భారీగా పెర‌గొచ్చు

అమ‌రావ‌తి : ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు 50 శాతం మేర పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్