hyderabadupdates.com movies గూఢచారి-2 ఎప్పుడు వస్తుంది?

గూఢచారి-2 ఎప్పుడు వస్తుంది?

తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే హీరోల్లో అడివి శేష్ ఒకడు. ‘క్షణం’ సినిమా నుంచి అతడి కెరీర్ మారిపోయింది. రైటింగ్, మేకింగ్‌లోనూ ఇన్వాల్వ్ అవుతూ క్వాలిటీ సినిమాలు అందిస్తూ.. తన మీద ప్రేక్షకులకు బాగా గురి కుదిరేలా చేసుకున్నాడు శేష్. కాకపోతే రైటింగ్, మేకింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ తన టీమ్స్ చాలా టైం తీసుకుంటాయి కాబట్టి సినిమాలు ఆలస్యం అవుతుంటాయి.

2022లో హిట్-2తో పలకరించిన శేష్ నుంచి.. మళ్లీ ఇప్పుడే హీరోగా సినిమా వస్తోంది. అదే.. డెకాయిట్. ఈ శుక్రవారమే ఈ చిత్రం విడుదల కానుంది. ఐతే శేష్ చేతిలో ఉన్న వాటిలో దీన్ని మించి ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. జీ2. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

‘గూఢచారి’ పెద్ద హిట్ అయిన నేపథ్యంలో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను నిజానికి గత ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆలస్యం అయింది. ‘డెకాయిట్’ రిలీజయ్యాకు కొన్ని నెలల గ్యాప్‌లో ఈ సినిమా కూడా వచ్చేస్తుందని ప్రేక్షకులు ఆశిస్తుండగా.. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పేశాడు శేష్.

‘గూఢచారి-2’ ఈ ఏడాది చివర్లోనే రిలీజవుతుందని స్పష్టం చేశాడు శేష్. షూట్ మొదలైనపుడు ఈ చిత్రాన్ని గత ఏడాది ఆఖర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇంకో ఏడాది తర్వాత కానీ సినిమా విడుదల కావట్లేదు. తన కాలికి గాయం కావడం వల్ల మూడు నెలల పాటు చిత్రీకరణల్లో పాల్గొనలేదని.. అందుకే ‘డెకాయిట్’తో పాటు ‘జీ-2’ కూడా ఆలస్యం అయిందని శేష్ వెల్లడించాడు.

తాను చాలా లేటుగా సినిమాలు చేస్తాననే కంప్లైంట్ ఉందని.. తన నుంచి వరుసగా సినిమాలు రావాలంటే తాను రైటింగ్‌లో ఇన్వాల్వ్ కాకూడదని శేష్ అన్నాడు. డెకాయిట్, జీ-2 తర్వాత తాను రెండు సినిమాలకు రైటింగ్‌లో జోక్యం చేసుకోనని.. చకచకా ఆ రెండు చిత్రాలు పూర్తి చేస్తానని.. తన నుంచి ఫక్తు తెలుగు సినిమా ఒకటి వస్తుందని చెప్పాడు శేష్.

‘మేజర్’ సినిమా తర్వాత బాలీవుడ్ నుంచి తనకు అరడజను ఆఫర్లు వచ్చాయని.. అందులో నాలుగు వార్ ఫిలిమ్స్ కాగా, రెండు బయోపిక్స్ అని.. కానీ అందులో ఏ చిత్రాన్నీ అంగీకరించలేదని.. ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో అది చేశాక, అలాంటి సినిమాలు ఇంకేవీ చేయకూడదని ఫిక్సయ్యానని శేష్ తెలిపాడు.

Related Post

Harish Shankar Apologizes to Mahesh Babu Fans Over Tweet Controversy – Here’s What HappenedHarish Shankar Apologizes to Mahesh Babu Fans Over Tweet Controversy – Here’s What Happened

Director Harish Shankar is currently busy wrapping up the post-production work of Ustaad Bhagat Singh, starring Pawan Kalyan. However, ahead of the film’s release, the director landed in a bit