hyderabadupdates.com movies చిరుపై విమర్శకులకు లావణ్య కౌంటర్

చిరుపై విమర్శకులకు లావణ్య కౌంటర్

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. చరణ్ భార్య ఉపాసన ఒకే కాన్పులో మగబిడ్డ, ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐతే ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో టపాసులు కాల్చి మెగా ఫ్యాన్స్ సందడి చేయడం మీద కొన్ని విమర్శలూ వచ్చాయి.

అంతే కాక తనకు ఎట్టకేలకు మనవడు పుట్టడం గురించి చిరు సంబరపడిపోతున్నాడంటూ ఆయన పాత, తాజా వ్యాఖ్యలను జోడించి మెగాస్టార్‌ను సామాజిక మాధ్యమాల్లో కొందరు కౌంటర్లు వేస్తున్నారు.

ఇప్పటిదాకా చిరు పిల్లలు ముగ్గురికీ అమ్మాయిలే పుట్టారు. మూడో తరంలో తొలి మగబిడ్డ ఇప్పుడే పుట్టాడు. ఐతే గతంలో ఒక ఈవెంట్లో చిరు మాట్లాడుతూ.. ఇంట్లో పిల్లలందరూ అమ్మాయిలే కావడంతో తనకు తాను లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా అనిపిస్తానని, మనవడి కోసం ఎదురు చూస్తున్నానని చిరు యథాలాపంగా ఒక కామెంట్ చేశారు.

ఇప్పుడు మనవడు పుట్టడం గురించి ఆయన సంతోషం వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ.. మగబిడ్డ మీద చిరుకు మోజు అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక ఫిలిం క్రిటిక్ కూడా దీని మీద పోస్ట్ ఒక పోస్ట్ చేశాడు.

ఈ నేపథ్యంలో ఆ క్రిటిక్‌కే కాక, చిరు విమర్శకులందరికీ బదులిస్తూ.. మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టింది. ‘‘నేను సాధారణంగా ఇలాంటి ట్వీట్లను పట్టించుకోను. కానీ నేను ఇలాంటి పోస్టును మీ నుంచి ఊహించలేదు. ఇది మీ పేలవ అభిరుచిని చాటుతోంది.

ఒక సంతోషకరమైన సందర్భాన్ని ఇబ్బందికరంగా మార్చుతుంది. ఆయన తన కుటుంబంలో మహిళలను ఎలా చూస్తారో మీకు తెలియదు. ముఖ్యంగా తన మనవరాళ్లతో ఎలా ఉంటారో తెలియదు. ఆయన చేసేదాంట్లో ఒక్క శాతం చేసే మగాళ్లు కూడా చాలా తక్కువమందే ఉంటారు. మీకు నిజంగా తెలియని వ్యక్తి గురించి కామెంట్ చేయకపోవడం ఉత్తమం’’ అని లావణ్య పేర్కొంది. చిరు విమర్శకులకు ఈ పోస్టు గట్టిగానే గుచ్చుకుంది. పోస్టు పెట్టిన ఫిలిం క్రిటిక్ కూడా దాన్ని డెలీట్ చేశాడు.

Related Post

Allu Arjun, Lokesh Kanagaraj Team Up for a Powerful New FilmAllu Arjun, Lokesh Kanagaraj Team Up for a Powerful New Film

Icon Star Allu Arjun has officially set the internet buzzing by confirming his much-awaited new film, tentatively titled AA23, marking his first-ever collaboration with blockbuster director Lokesh Kanagaraj. The announcement