hyderabadupdates.com Gallery జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి

జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి

జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి post thumbnail image

న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు కేంద్రం త‌క్ష‌ణ‌మే నిధులు మంజూరు చేయాల‌ని కోరారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న కేంద్ర రోడ్లు, రవాణా , హైవే శాఖ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించి ప‌లు ప్ర‌తిపాద‌న‌లు అంద‌జేశారు. జాతీయ ర‌హ‌దారుల‌ ప్రాజెక్టుల అభివృద్ధి, విస్తరణ, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చ‌ర్చించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టుల మంజూరు, అమలును వేగవంతం చేయాలని కోరారు. ఈ సంద‌ర్బంగా మంత్రి చేసిన‌ ప్రతిపాదనలకు అనుమతులు, పెండింగ్ సమస్యలపై సానుకూలంగా స్పందించారు సెక్ర‌ట‌రీ.
ఇదిలా ఉండ‌గా కార్య‌ద‌ర్శిని క‌లిసిన అనంత‌రం మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ఏపీలో జాతీయ ర‌హ‌దారుల‌ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు.. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల మంజూరు, విస్తరణ పనుల అమలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్ర రోడ్లు, రవాణా , హైవే శాఖ సెక్రెటరీ ఉమాశంకర్ ను కలిసి కోరడం జరిగిందన్నారు. అనంతరం ఆయనకు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశామ‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం చంద్రబాబు నాయక‌త్వంలో రాష్ట్రం అభివృద్దిలో ప‌రుగులు తీస్తోంద‌న్నారు.
The post జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదలసహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదల

అమరావతి : చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సంక్రాంతి ముంగిట శుభవార్త తెలిపారు. ఆప్కో బకాయిలకు సంబంధించి రూ.5 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. గతంలో చేనేత

మ‌హాశ‌క్తి ప‌థ‌కం పేరుతో మ‌హిళ‌ల ద‌గా : ష‌ర్మిలా రెడ్డిమ‌హాశ‌క్తి ప‌థ‌కం పేరుతో మ‌హిళ‌ల ద‌గా : ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని , రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతీ లేకుండా పోయింద‌న్నారు. పండుగల

పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటనపోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యోగేష్ పైతాన్కర్ శనివారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల సమీక్ష , పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పీ పీ