hyderabadupdates.com Gallery టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు

టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు

టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు post thumbnail image

హైద‌రాబాద్ : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ప్ర‌తి నిత్యం 70 వేల మందికి పైగా భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల కోసం ప్ర‌త్యేకంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిత్య అన్న‌దానం ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో వెంగ‌మాంబ అన్న‌దానం స‌త్రం ద్వారా ఆక‌లిని తీరుస్తోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో 1985 ఏప్రిల్ 6న ఆనాటి ముఖ్యమంత్రి , దివంగ‌త నందమూరి తారక రామారావు ప్రవేశ పెట్టిన నిత్యాన్నదాన పథకం అన్నదాన సేవలో నేటితో మరో ఏడాది పూర్తి చేసుకుంది. 4 దశాబ్దాల క్రితం కేవలం 2 వేల మందికి అన్న వితరణతో ప్రారంభమైన ఈ గొప్ప కార్యక్రమం నేడు రోజుకు 2.80 లక్షల మంది భక్తలకు అన్నప్రసాదం అందించే స్థాయికి చేరింది.
భక్తుల భాగస్వామ్యం, సహకారంతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి ప్రస్తుతం రూ 2,500 కోట్లు దాటింది. అన్నదాన పథకం నుంచి స్ఫూర్తి పొంది ప్రాణదానం ట్రస్ట్, విద్యాదానం ట్రస్ట్ లు ఏర్పాటు చేసి టీటీడీ ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తోంది. టీటీడీ పరిధిలోని మరో 60 దేవాలయాలతో పాటు అన్ని ప్రముఖ ఆలయాల్లో నిత్యాన్నదానం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి ముందుకు వచ్చి స‌హ‌కారం అందిస్తున్నారు దాత‌లు, మాన‌వ‌తావాదులు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి రోజు లక్ష మందికి పైగా భ‌క్తులు భోజ‌నం చేస్తున్నారు. ఒక రోజుకు దాదాపు రూ. 30 ల‌క్ష‌ల దాకా ఖ‌ర్చు అవుతోంది. ఈ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి దాత‌లు, భ‌క్తులు రూ. 1000 నుంచి రూ. కోటి దాకా ఇవ్వ‌వ‌చ్చు.
The post టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖ‌మేనీ ఖ‌తంఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖ‌మేనీ ఖ‌తం

ఇరాన్ : ఇరాన్ దేశానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. నిన్న‌టి దాకా అమెరికా, ఇజ్రాయెల్ తో ఒంట‌రి పోరాటం చేస్తూ వ‌చ్చిన ఆ దేశ అధ్య‌క్షుడు ఖ‌మేనీ ఇజ్రాయెల్, అమెరికా జ‌రిపిన దాడుల్లో ఖ‌తం అయ్యాడు. ఈ విష‌యాన్ని అటు ట్రంప్

YS Jagan: సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ ! బేగంపేటలో వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం !YS Jagan: సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ ! బేగంపేటలో వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం !

    అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. మరోవైపు వైసీపీ

Punjab Ex DGP: మాజీ డీజీపీ కొడుకు అనుమానాస్పద మృతి కేసులో భయానక ట్విస్ట్‌Punjab Ex DGP: మాజీ డీజీపీ కొడుకు అనుమానాస్పద మృతి కేసులో భయానక ట్విస్ట్‌

      పంజాబ్ మాజీ డీజీపీ కొడుకు మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్‌ వెలుగు చూసింది. తన భార్యతో… తన తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. అప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు చంపేందుకు కూడా