hyderabadupdates.com Gallery డేటా ఆధారిత ప్రణాళికతో భక్తులకు మరింత సౌకర్యాలు

డేటా ఆధారిత ప్రణాళికతో భక్తులకు మరింత సౌకర్యాలు

డేటా ఆధారిత ప్రణాళికతో భక్తులకు మరింత సౌకర్యాలు post thumbnail image

తిరుమల : త్వరలో ప్రారంభం కానున్న వేసవి సెలవులకు రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో వేసవి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు–మూడు సంవత్సరాల వేసవి డేటాను విశ్లేషించి, దర్శనాల సంఖ్య, వేచి ఉండే సమయం, తర్వాత రోజు దర్శనాలకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సంఖ్య వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్న ప్రసాదం, తాగునీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యంలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్, అవసరమైన చోట్ల షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వేసవి సెలవుల్లో కుటుంబాలతో కలిసి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో వసతి సదుపాయాలు, అన్న ప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేసి మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి వీలైనంత త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అదనపు ఈవో తెలిపారు. ఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచి, గంటల వారీగా ఇన్–అవుట్ ఫ్లో, వేచి ఉండే సమయాన్ని ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
వివిధ కేటగిరీల దర్శనాలను డేటా ఆధారంగా హేతుబద్ధంగా కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో భక్తులు వేగంగా దర్శనం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత వేసవిలో జూన్ నెలలో సగటున రోజుకు 80 వేల నుంచి 82 వేల మందికి దర్శనం కల్పించామని, అలాగే 2026 జనవరిలో రోజుకు సగటున 74 వేల మందికి పైగా దర్శనం కల్పించినట్లు గుర్తు చేశారు. ఇది సమర్థవంతమైన టైమ్ మేనేజ్‌మెంట్, అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైందని వివరించారు. వేసవిలో భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని అదనపు ఈవో ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
The post డేటా ఆధారిత ప్రణాళికతో భక్తులకు మరింత సౌకర్యాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kashibugga Stampade: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !Kashibugga Stampade: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !

Kashibugga : శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా… 16 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి

MBBS Seats: కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లు ఎన్ఎంసీ ఆమోదంMBBS Seats: కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లు ఎన్ఎంసీ ఆమోదం

    వైద్య విద్య అభ్యసించాలని కోరుకొనే ఔత్సాహికులకు ఎన్ఎంసీ శుభవార్త చెప్పింది. దేశంలో 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లకు జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఆమోదం తెలియజేసింది. అలాగే కొత్తగా 41 వైద్య కశాళాలలు కూడా రాబోతున్నాయి.

Kinjarapu Atchennaidu: వైఎస్ జగన్‌ కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్Kinjarapu Atchennaidu: వైఎస్ జగన్‌ కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్

    వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఒక అబద్దాల కోరని విమర్శించారు. ఆయన గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందన్నారు. గురువారం ఉమ్మడి