hyderabadupdates.com movies తల్లి సినిమాలు ఒక్కటీ చూడని హీరో పిల్లలు

తల్లి సినిమాలు ఒక్కటీ చూడని హీరో పిల్లలు

సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు ఆసక్తి చూపిస్తారు. తాము ఇండస్ట్రీలోకి వచ్చినా రాకపోయినా.. తమ తల్లిదండ్రులు సినీ నటులైతే వాళ్ల సినిమాలతో పాటు వేరేవి కూడా చూడడానికి ఉత్సాహం చూపిస్తారు. తల్లిద్రండులు కూడా తమ పిల్లలకు తమ సినిమాలు చూపించాలని ఆశపడతారు.

కానీ ఒకప్పుడు తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరైన షాలిని.. తన పిల్లలకు ఇప్పటిదాకా తన సినిమాలు చూపించలేదట. వాళ్లు కూడా ఆమె సినిమాలు చూసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదట. అజిత్, షాలిని దంపతులకు అనౌష్క, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ టీనేజీలోనే ఉన్నారు. వాళ్లకు సినిమాలు చూసే వయసు ఎప్పుడో వచ్చేసింది. తమిళంలో టాప్ స్టార్ అయిన తండ్రి సినిమాలను వాళ్లు చూడకుండా ఉండరు.

ఐతే 20 ఏళ్ల కిందటే షాలిని సినిమాలు వదిలేయగా.. అంతకుముందు ఆమె నటించిన సినిమాలు ఏవీ అనౌష్క, ఆద్విక్ చూడలేదట. తాను వాళ్లకు తన సినిమాలను చూపించాలని ప్రయత్నించలేదని.. వాళ్లు కూడా తన చిత్రాలు చూడాలన్న ఆసక్తిని ప్రదర్శించలేదని ఒక కార్యక్రమంలో షాలిని చెప్పింది. 90వ దశకంలో అజిత్ సరసన ‘అమర్కలం’ అనే బ్లాక్ బస్టర్ మూవీలో నటించినపుడు తనతో ప్రేమలో పడి, కొన్నేళ్లకే అతణ్ని పెళ్లి చేసుకుంది షాలిని.

అంతకంటే ముందు ఆమె సఖి లాంటి క్లాసిక్, ‘కాదలక్కు మర్యాద’ లాంటి బ్లాక్ బస్టర్, ఇంకా పలు చిత్రాల్లో నటించింది. కెరీర్లో చాలా వరకు నటనకు ప్రాధాన్యమున్న, మంచి మంచి పాత్రలే చేసింది షాలిని. ముఖ్యంగా ‘సఖి’లో తన పాత్ర, నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి క్లాసిక్స్‌లో నటించి కూడా పిల్లలకు ఆ సినిమాలు చూపించకపోవడం.. ఆమె పిల్లలు కూడా తల్లి ఎలా నటించిందో చూద్దామని ఆ చిత్రాలను ట్రై చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Related Post

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీరష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు తెలుగు వాళ్లకు ఉండే సంబంధం మాటల్లో చెప్పలేనిది. గోంగూరతో చేసే వంటకాలు చాలానే ఉన్నాయి. వాటిలో గోంగూర పచ్చడి ఒకటి.

వరప్రసాద్ గారు అడ్వాన్స్ అవుతున్నారువరప్రసాద్ గారు అడ్వాన్స్ అవుతున్నారు

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లు దసరా నుంచి మొదలుపెట్టేస్తున్నారు. పబ్లిసిటీలో తనదైన మార్కు చూపించే రావిపూడి ఈసారి మూడు నెలలకు సరిపడా ప్లాన్ ని సిద్ధం చేసి ఉంచుకున్నాడట. ఇంకా షూటింగ్ పెండింగ్

`సంస్థాగ‌త సైన్యం`.. ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యం.. !`సంస్థాగ‌త సైన్యం`.. ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యం.. !

ఏపార్టీకైనా.. నాయ‌కుల‌తోపాటు సంస్థాగ‌తంగా ఉండే నేత‌లే కీల‌కం. పార్టీ జెండా ప‌ట్టాల‌న్నా.. పార్టీ త‌ర‌ఫున బ‌లోపేతం చేయాల‌న్నా.. సంస్థాగ‌తంగా ఉన్న బ‌లం.. కీల‌కం. ఈ విష‌యంలో ఇత‌ర పార్టీల‌కు భిన్నంగా టీడీపీకి బ‌ల‌మైన సంస్థాగ‌త సైన్యం ఉంది. పార్టీ అనేక సంద‌ర్భాల్లో