hyderabadupdates.com movies తాండవం మొదలుపెట్టే టైమయ్యింది

తాండవం మొదలుపెట్టే టైమయ్యింది

అఖండ 2 విడుదలకు ఇంకో ముప్పై నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 5 రిలీజ్ అధికారికంగా ప్రకటించేశారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రమోషన్లు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇప్పటిదాకా చిన్న టీజర్ తప్ప ఎలాంటి విజువల్ కంటెంట్ బయటికి రాలేదు. ఒకవైపు తమన్ ఆలస్యం జరగకుండా రీ రికార్డింగ్ పనులు ఒక క్రమపద్ధతిలో పూర్తి చేస్తున్నాడు. ఇంకోవైపు దర్శకుడు బోయపాటి శీను పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటూనే ఫైనల్ టచప్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అవుట్ ఫుట్ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని కానీ ముందుకెళ్లడం లేదట. సో అందరూ లైన్ లోనే ఉన్నారు.

అయితే నార్త్ లో అఖండ 2కి మంచి పబ్లిసిటీ చేసి ప్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలనేది నిర్మాతల ఆలోచన. అదేదో ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి. ఎందుకంటే బాలయ్యకు హిందీలో ఎంత గుర్తింపు ఉన్నా ఓపెనింగ్స్ తెచ్చేందుకు అది సరిపోదు. లేదంటే భగవంత్ కేసరి, డాకు మహారాజ్ కూడా తెలుగుతో పాటు నార్త్ లోనూ సమాంతరంగా రిలీజయ్యేవి. కానీ అఖండ 2లో డివోషనల్ ఎలిమెంట్స్ ఉత్తరాది జనాలకు బాగా నచ్చుతాయనే ఉద్దేశంతో ప్లాన్ మారుస్తున్నారు. ఎలాగూ రణ్వీర్ సింగ్ దురంధర్ వాయిదా పడే సూచనలు ఉండటంతో అఖండ 2కి ఇది గోల్డెన్ ఛాన్స్.

ఎప్పుడో సంక్రాంతికి వచ్చే మన శంకరవరప్రసాద్ గారు నుంచి మొదటి లిరికల్ సాంగ్ వచ్చేసింది. ది రాజా సాబ్ బృందం టీజర్ పేరుతో రెండు ట్రైలర్లు రిలీజ్ చేసింది. డిసెంబర్ లో చివర్లో వచ్చే ఛాంపియన్, శంబాలా లాంటివి సైతం ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాలి. కానీ అఖండ 2 నుంచి ఇంకా ఒక్క పాటైనా బయటికి రాలేదు. ముందా లాంఛనాన్ని పూర్తి చేస్తే తర్వాత స్పీడ్ అందుకోవచ్చు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన అఖండ 2లో బాలయ్య డ్యూయల్ రోల్ తో పాటు ఆది పినిశెట్టి విలనిజం ప్రత్యేక ఆకర్షణలుగా నిలవబోతున్నాయి. బిజినెస్ వర్గాల్లో క్రేజ్ మాములుగా లేదు. 

Related Post

These 4 James Bond Movies Are Amazing, but I Think They’re a Bit Overrated
These 4 James Bond Movies Are Amazing, but I Think They’re a Bit Overrated

The James Bond franchise is among the few recurring blockbuster sagas that has maintained a consistent level of quality throughout its run. While there aren’t many Bond fans that would

Sunny Deol abuses the media over Dharmendra’s health rumorsSunny Deol abuses the media over Dharmendra’s health rumors

Sunny Deol lost his composure on Tuesday after sections of the media gathered outside his residence, taking pictures and spreading false rumors about his father, Dharmendra’s, health. Reports of Dharmendra’s