hyderabadupdates.com movies తెలంగాణ అసెంబ్లీలో ‘బాంబుల’ గోల

తెలంగాణ అసెంబ్లీలో ‘బాంబుల’ గోల

మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్‌లో పలు పిల్లర్లు కుంగిన వైనం తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికలకు ముందు చెలరేగిన రాజకీయ దుమారం ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రభావం చూపింది. పిల్లర్లు కుంగడానికి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. అయితే, బాంబుతో మేడిగడ్డ చెక్ డ్యామ్ ను పేల్చేశారని, అదే పిల్లర్లు కృంగడానికి కారణమని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

తన నియోజకవర్గంలోని తనుగుల చెక్‌డ్యామ్‌ను బాంబు పెట్టి పేల్చివేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ మాదిరిగానే చెక్‌డ్యామ్‌ను బాంబు పెట్టి పేల్చేశారని ఆయన చేసిన ఆరోపణలు సభలో దుమారం రేపాయి. అయితే, కౌశిక్ రెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ సభ్యులు ఖండించారు.

బాంబులు పెట్టి పేల్చారని ఆరోపణలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ స్పీకర్‌ను కాంగ్రెస్ సభ్యుడు నాగరాజు కోరారు. ఏది ఏమైనా సభలో కౌశిక్ రెడ్డి చేసిన బాంబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Post

చిన్న సినిమాల కొత్త ‘ఫార్ములా 99’చిన్న సినిమాల కొత్త ‘ఫార్ములా 99’

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల గురించి కొన్నేళ్ల నుంచి పెద్ద చర్చే జరుగుతోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మరీ అన్యాయంగా రేట్లు తగ్గించేయడంతో ఇండస్ట్రీ గగ్గోలు పెట్టింది. తర్వాత రేట్లు సవరించారు. అవి ఇటు ప్రేక్షకులకు, అటు

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌దులుకోం: లోకేష్‌ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌దులుకోం: లోకేష్‌

త‌మ పెట్టుబ‌డుల‌ను, కంపెనీల‌ను ఏపీ ఎగ‌రేసుకుపోతోంద‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వ్యాఖ్యానిస్తున్న నేప‌థ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌దులుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రాల మ‌ధ్య పోటీ ఉంటేనే పెట్టుబ‌డుల‌కు,