hyderabadupdates.com Gallery నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌ post thumbnail image

అనంత‌పురం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు నీటి భ‌ద్ర‌త గురించి. సోమ‌వారం అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ‘#జలధార’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే ధ్యేయంగా ప్రతి ఎకరాకు నీరు, ప్రతి రైతుకు భరోసా కల్పించేలా జలధార కార్యక్రమాన్ని రూపొందించాం అన్నారు. నీటి సంరక్షణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించాం అని అన్నారు సీఎం. 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యుల సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 2024లో అనంతపురం జిల్లాలో 13.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు సమర్థ నీటి నిర్వహణ ద్వారా 2.11 మీటర్ల మేర పెరిగింద‌ని, నేడు 11.25 మీటర్లకు చేరుకున్నాయని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
నీరు ఉంటేనే అభివృద్ధి, పరిశ్రమలు, సంక్షేమం-సంపద వ‌స్తుంద‌న్నారు. ఒకప్పుడు ఎడారిగా మారుతుంది అని అంతా భయపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా నేడు నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలతోనే ఉద్యాన రంగంలో అగ్రగామిగా ఉందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సాగునీటి సంఘాలు కలిసి అడుగేసి రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెంపుతో రికార్డులు సృష్టించాలని పిలుపునిచ్చారు. నీరు మనందరికీ సర్వస్వం… దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టమ‌ని ప్ర‌క‌టించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పని చేస్తున్నాం అని చెప్పారు.
The post నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కేర‌ళ లౌకిక వాదానికి అస‌లైన ఉదాహ‌ర‌ణ‌కేర‌ళ లౌకిక వాదానికి అస‌లైన ఉదాహ‌ర‌ణ‌

కేర‌ళ : కేర‌ళ రాష్ట్రంలో ప్ర‌స్తుతం శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం వామ‌ప‌క్ష పార్టీ సీపీఎం ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఉంది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త

కూట‌మి స‌ర్కార్ విజ‌యం అమరావతి అజేయంకూట‌మి స‌ర్కార్ విజ‌యం అమరావతి అజేయం

అమ‌రావ‌తి : పార్ల‌మెంట్ లో అమ‌రావ‌తి రాజ‌ధానిగా బిల్లు ఆమోదం పొంద‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటం ఆనందంగా

అమ‌రావ‌తిపై విషం క‌క్కుతున్న జ‌గ‌న్ రెడ్డిఅమ‌రావ‌తిపై విషం క‌క్కుతున్న జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై. గురువారం ఎన్డీయే నేత‌ల‌తో అమ‌రావ‌తి బిల్లు ఆమోదం పొందిన సంద‌ర్భంగా టెలికాన్ఫ‌రెన్స్ చేప‌ట్టారు. ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోందన్నారు.