hyderabadupdates.com Gallery నీటి సంరక్షణ కోసం జలధార ఉద్యమం

నీటి సంరక్షణ కోసం జలధార ఉద్యమం

నీటి సంరక్షణ కోసం జలధార ఉద్యమం post thumbnail image

సోమందేపల్లి/శ్రీసత్యసాయి జిల్లా : నీటితోనే సంపద సృష్టించొచ్చాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమని, అందుకనే ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీత, మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులను ఈ కార్యక్రమంలో చేపట్టనున్నారని తెలిపారు. రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలకు రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో కలిసి వంద రోజుల ప్రణాళికలను రూపొందించారన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామం సమీపంలోని చెరువులో ఏర్పాటు చేసిన జలధార కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో నీటి సంరక్షణకు పెద్ద ఎత్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణకు 100 రోజుల పాటు జలధార ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యాచరణ ద్వారా రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలతో ప్రతి ఎకరాకూ సాగు నీరందించాలన్నది ప్రధాన ఉద్దేశమన్నారు. వంద రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీతలతో పాటు మరమ్మతులు, ఇంకుడు గుంతలు తవ్వుతామన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంచడం, తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే విధానాన్ని (డ్రిప్ ఇరిగేషన్) ప్రోత్సహించడం, చెరువుల్లోని మట్టిని పొలాలకు తరలించడం, పంట కుంటల నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. నీటి సంరక్షణను ఉద్యమం చేపట్టామని, రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ ఉద్యమం చేపట్టామన్నారు. రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు.
The post నీటి సంరక్షణ కోసం జలధార ఉద్యమం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదలCM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదల

CM Nitish Kumar : బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్‌కు (CM Nitish Kumar) చెందిన జనతాదళ్ యునైటెడ్

ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్

తాడేప‌ల్లి గూడెం : ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లా వేదిక‌గా కొన్నేళ్లుగా స్వ‌చ్చందంగా , నిస్వార్థంగా సేవ‌లు అంద‌జేస్తూ వ‌స్తోంది రూరల్‌

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటుప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటు

అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజల‌ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనత‌, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. అన్న ఎన్టీఆర్