hyderabadupdates.com movies పవన్ కు అంబటి కూతురు సూటి ప్రశ్న

పవన్ కు అంబటి కూతురు సూటి ప్రశ్న

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దాడిపై అంబటి రాంబాబు కూతురు మౌనిక మీడియాతో మాట్లాడారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని సంచలన ఆరోపణలు చేశారు. మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా అని ప్రశ్నించారు.

కాపు మహిళలైన తమపై కూడా దాడులు చేశారని, లకారాలతో బండబూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను అన్నది చంద్రబాబును కాదని అంబటి రాంబాబు క్లియర్ గా చెప్పారని, గతంలో చంద్రబాబు కూడా జగన్ ను అనేక సార్లు అనరాని మాటలు అన్నారని చెప్పారు.

తాను అలా మాట్లాడినందుకు అంబటి రాంబాబు క్షమాపణ కూడా చెప్పారని గుర్తు చేశారు. 8 గంటలపాటు తమపై దాడి చేశారని, మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆయన బలాన్ని చూసుకునే వాళ్ళు ఇలాంటి దాడి చేశారని ఆరోపించారు.

తమ ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదని, టీడీపీ గూండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.

తాగుబోతులను తమపైకి ఉసిగొల్పారని, ఆమెకు నైతిక విలువలున్నాయా అని ప్రశ్నించారు. ఇక, సినిమా చూపిస్తానని పెమ్మసాని అంటున్నారని, మహిళలపై ఇలా దాడులు చేయడమే సినిమా చూపించడమా అని ప్రశ్నించారు. దీనికి పెమ్మసాని భార్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“కాపులు అంటూ ప్రస్తావించి మా ఇంటిమీద దాడి చేశారు.దీనికి పవన్ కల్యాణ్ గారి బలాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారు.ఈ దాడిని ఆయన ఖండించాలి.”– అంబటి రాంబాబు కుమార్తె pic.twitter.com/vuij78fs5A— Gulte (@GulteOfficial) February 2, 2026

Related Post

6 Malayalam OTT releases to watch this week: Shabareesh Varma’s Inspection Bungalow to Avihitham6 Malayalam OTT releases to watch this week: Shabareesh Varma’s Inspection Bungalow to Avihitham

Cast: Unni Raj, Renji Kankol, Vineeth Chakyar, Dhanesh Koliyat, Rakesh Ushar, Vrinda Menon, Ajith Punnad, Unnikrishnan Parappa Director: Senna Hegde Runtime: 1 hour and 45 minutes Genre: Satirical Black Comedy

మారుతీ భావోద్వేగానికి కదిలిపోయిన ఫ్యాన్స్మారుతీ భావోద్వేగానికి కదిలిపోయిన ఫ్యాన్స్

హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వేడుక జరిగిన మైదానం కొంచెం చిన్నదే అయినప్పటికీ వేలాదిగా వచ్చిన డార్లింగ్ అభిమానులతో ప్రాంగణం కోలాహలంగా మారింది. నటించిన, పని చేసిన ప్రతి ఒక్కరు హాజరు కావడంతో ఏదో మిస్