hyderabadupdates.com movies బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు చేస్తారని కొందరు హేటర్లు కామెంట్ చేయడం చూశానని, కానీ కంటెంట్ బేస్డ్ ఎక్కువ చేసింది కూడా మాస్ మహారాజేనని, నా ఆటోగ్రాఫ్ – శంభో శివశంభో లాంటివి ప్రేక్షకులు హిట్ చేసి ఉంటే మరిన్ని విలక్షమైన చిత్రాలు చేసేవారని చెప్పుకొచ్చారు.

వినడానికి బాగానే ఉంది కానీ ఇక్కడ బాబీ మిస్సవుతున్న లాజిక్ ఒకటుంది. రవితేజ రెగ్యులర్ గా వెళ్తున్నారనే కంప్లయింట్ ఎవరికీ లేదు. అవే చేసినా పర్వాలేదు కానీ అలరించేలా, ఎంటర్ టైన్ చేసేలా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నారు. అది జరగకపోవడం వల్లే ఫ్లాపులు.

కమర్షియల్ హీరోలకు ఎప్పటికీ చెరిపేయలేని కొన్ని పరిధులు ఉంటాయి. చిరంజీవి అంతటి మెగాస్టార్ రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి గొప్ప క్లాసిక్స్ చేస్తే జనం తిరస్కరించారు. శ్రీమంతుడు తరహా పాయింట్ తో కె విశ్వనాథ్ డైరెక్షన్లో బాలకృష్ణ జనని జన్మభూమి అనే సినిమా చేశారని ఎంతమందికి తెలుసు.

నాగార్జున కూలిలో విలన్ గా నటిస్తే స్వంత ఫ్యాన్సే జీర్ణించుకోలేపోయారు. కాబట్టి మాస్ చిత్రాలు ఎన్నయినా చేయొచ్చు. అవి అంచనాలు అందుకుంటే చాలు. అంతెందుకు బాబీనే తీసిన వాల్తేరు వీరయ్యలో సందేశం, ఎక్స్ పరిమెంట్లు లేవు. చిరంజీవి, రవితేజ కాంబోలో వచ్చిన మసాలా బ్లాక్ బస్టర్ అది.

కాబట్టి ఫలానా సినిమా హిట్ చేయకపోవడం అనేది ముమ్మాటికి ఆడియన్స్ తప్పు కానే కాదు. తాము కోరుకున్నవి ఇవ్వలేనప్పుడు మొహమాటం లేకుండా రిజక్ట్ చేస్తారు. హరిహర వీరమల్లుని డిజాస్టర్ చేసిన జనాలే ఓజికి మూడు వందల కోట్లు పువ్వుల్లో పెట్టి ఇచ్చారు. భోళా  శంకర్ ని తిట్టుకున్న ఫ్యాన్సే ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారుకి ఘనస్వాగతం చెబుతున్నారు.

రవితేజకైనా అంతే. ధమాకాకి అంత పెద్ద విజయం అందించిన విషయం మర్చిపోతే ఎలా. సో సరైన సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ బ్యాటింగ్ మాములుగా ఉండదు. ఈసారి భర్త మహాశయులకు విజ్ఞప్తితో అది నెరవేరుతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

#BobbyKolli :“#RaviTeja గారు Regular సినిమాలు చేస్తున్నారు అంటే కోపం వస్తుంది.అందరికంటే Concept-Oriented Films చేసేది ఆయనే.”#BharthaMahasayulakuWignyapthi pic.twitter.com/SOCJwDMvOA— Gulte (@GulteOfficial) January 10, 2026

Related Post

ఈవీఎంల‌పై పీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లుఈవీఎంల‌పై పీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

“ఇటీవ‌ల‌కాలంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. అదృశ్య శ‌క్తుల ప్ర‌మేయం ఉంటోంది. ఈ విష‌యాన్ని చాలా ఆల‌స్యంగా గుర్తించా. కానీ, ఇది నిజం. అయితే.. ఆ శ‌క్తులు ఎవ‌రు? ఎలా వ‌స్తున్నారు? ఎక్క‌డ నుంచి వ‌స్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే విష‌యాల‌పై మాత్రం

Visakhapatnam Emerges as Andhra Pradesh Growth Engine Under Coalition GovernmentVisakhapatnam Emerges as Andhra Pradesh Growth Engine Under Coalition Government

After the coalition government assumed office, Visakhapatnam has rapidly transformed into a symbol of Andhra Pradesh’s new development vision. The coastal city is steadily evolving into a global urban hub,