hyderabadupdates.com movies బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల మధ్య కూర్చున్న ఒక వ్యక్తిని చూసి బస్టాండ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే అతను మహిళ కాదు, ఒక యువకుడని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బస్టాండ్ ఆవరణలో మహిళల కోసం కేటాయించిన సీట్లలో ఒక వ్యక్తి బుర్ఖా ధరించి కూర్చున్నాడు. అతని నడక, ప్రవర్తనలో తేడా గమనించిన అక్కడి సిబ్బంది అతన్ని నిలదీశారు. అతను ఒక పురుషుడని గుర్తించిన తర్వాత, అసలు ఎందుకు బుర్ఖా వేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

అయితే ఆ యువకుడు మాత్రం దేనికీ సరైన సమాధానం చెప్పకుండా, ఏదో లోకంలో ఉన్నట్లు నవ్వుతూ సమాధానాన్ని దాటవేశాడు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పొందడానికే అతను ఈ వేషం వేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ డబ్బులు మిగిల్చుకోవడానికి ఇలాంటి వింత వేషధారణతో బస్సు ఎక్కాలని ప్లాన్ చేశాడా అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

పోలీసులు ఎంత అడుగుతున్నా ఆ యువకుడు మాత్రం సూటిగా సమాధానం చెప్పడం లేదు. ఏదో సరదా కోసం చేశాడా లేక నిజంగానే ఫ్రీ బస్ కోసమే ఇలా వేషం మార్చాడా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ వింత వేషధారణ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఫ్రీ బస్ కోసమే అయితే ఇంత సాహసం చేస్తారా అని కొందరు అంటుంటే, ఇంకేదైనా కారణం ఉందేమోనని మరికొందరు అనుమానిస్తున్నారు.

Related Post

ఎన్నికల్లో సెంటిమెంటు లెక్క‌లు మారాయా?ఎన్నికల్లో సెంటిమెంటు లెక్క‌లు మారాయా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో ఫ‌లితం కాంగ్రెస్‌కు అనుకూలంగా వ‌చ్చింది. వాస్త‌వానికి ఇక్క‌డ పార్టీల కంటే కూడా.. సెంటిమెంటుకు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఉంటుంద‌న్న చ‌ర్చ సాగింది. ముఖ్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నుంచి మూడు ర‌కాల సెంటిమెంట్లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇదే

బాలయ్య కెరీర్ లో మొదటిసారి 3Dబాలయ్య కెరీర్ లో మొదటిసారి 3D

డిసెంబర్ అయిదు విడుదల కాబోతున్న అఖండ 2 తాండవం ఎప్పుడూ చూడని ఒక సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అదే 3డి వర్షన్. ఇప్పటిదాకా బాలకృష్ణ కెరీర్ లో ఏ సినిమా ఈ సాంకేతికత వాడలేదు. ఆ మాటకొస్తే సీనియర్