hyderabadupdates.com Gallery భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్ post thumbnail image

అమెరికా : దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి భార‌త దేశంపై నోరు పారేసుకున్నారు. ఇండియా త‌మ‌కు సుంకాలు చెల్లిస్తుంద‌ని, కానీ తాము వారికి ఎట్టి ప‌రిస్థితుల్లో చెల్లించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. శ‌నివారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గ‌తంలో చెల్లించ‌డం జ‌రిగింద‌ని, కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింద‌న్నారు. అమెరికా సుంకాలు చెల్లించుకుండా ఇండియాతో ఇప్ప‌టికే ఒప్పందం చేసుకున్నామంటూ బాంబు పేల్చారు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ పై భార‌తీయులు, ఎన్నారైలు భ‌గ్గుమంటున్నారు. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌దాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అమెరికా దేశాధ్య‌క్షుడికి ఎందుకు త‌ల వంచారంటూ ప్ర‌శ్నించారు. ఇదేనా మీ పాల‌న అంటూ మండిప‌డ్డారు.
ఇదిలా ఉండ‌గా డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ లు చెల్ల‌వంటూ ఆ దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అయినా ట్రంప్ త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. త‌న‌కు ఎదురు దెబ్బ త‌గ‌ల‌డంతో నిన్న‌టి దాకా మౌనంగా ఉన్న అధ్య‌క్షుడు ఉన్న‌ట్టుండి ఇవాళ నోరు మెదిపారు. కేవ‌లం 10 శాతం మాత్ర‌మే సుంకాలు త‌గ్గాయ‌న్నారు. తాజాగా చోటు చేసుకున్న తీర్పుకు అనుగుణంగా ఇండియా 18 శాతం టారిఫ్ నుండి 10 శాతం త‌గ్గిన సుంకం రేటును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవాళ సంత‌కం చేశారు. త‌క్ష‌ణ‌మే ఇది అమ‌లులోకి వ‌స్తుంద‌ని అన్నారు ట్రంప్. ఫార్మాతో సహా ప్రత్యేక దర్యాప్తులో ఉన్న రంగాలకు, యుఎస్-మెక్సికో-కెనడా ఒప్పందం ప్రకారం యుఎస్‌లోకి ప్రవేశించే వస్తువులకు మినహాయింపులు వ‌ర్తిస్తాయ‌న్నారు.
The post భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలుIAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

    రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 31 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఆదేశాలు జారీ చేశారు.

Delhi: ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదంDelhi: ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం

      దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్ల సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. చిన్నారులు టపాసులు కాలుస్తుండగా ఫర్నీచర్‌ కి మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బీడీ మార్గ్‌లోని ఈ

‘Kantara Chapter 1’ Success Trailer Released by Hombale Films‘Kantara Chapter 1’ Success Trailer Released by Hombale Films

The prequel to the blockbuster Kantara, titled Kantara Chapter 1, has been receiving widespread acclaim since its release. Celebrating the overwhelming audience response, Hombale Films released the official Success Trailer