hyderabadupdates.com Gallery మ‌య‌న్మార్ అధ్య‌క్షుడిగా ఆర్మీ చీఫ్ ఎన్నిక‌

మ‌య‌న్మార్ అధ్య‌క్షుడిగా ఆర్మీ చీఫ్ ఎన్నిక‌

మ‌య‌న్మార్ అధ్య‌క్షుడిగా ఆర్మీ చీఫ్ ఎన్నిక‌ post thumbnail image

మ‌య‌న్మార్ (బ‌ర్మా) : ఆంగ్ సాన్ సూకీ నిర్భంధం త‌ర్వాత మ‌య‌న్మార్ ఒక‌నాటి బ‌ర్మా దేశం ప‌గ్గాలు నియంత‌గా పేరు పొందిన‌, ఆ దేశ ఆర్మీ చీఫ్ మిన్ ఆంగ్ హైంగ్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ప్రత్యక్ష ఓట్ల లెక్కింపు జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన లెక్కింపులో మిన్ ఆంగ్ హ్లైంగ్ గెలుపునకు అవసరమైన కనీస ఓట్లను దాటిన‌ట్లు ప్ర‌క‌టించారు. త‌ను సైనిక అనుకూల పార్లమెంట్ ద్వారా ఎన్నిక కావ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. అనుభవజ్ఞుడైన ఈ జనరల్ సైనిక పాలకుడిగా తన పదవికి రాజీనామా చేశారు. మ‌రో వైపు త‌న ఎన్నిక పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని అక్క‌డి ప్ర‌జాస్వామిక వాదులు ఆందోళ‌న చేప‌ట్టారు.
సైనిక పాలనను పటిష్టం చేయడానికి జరిగిన బూటకమని ఇటీవలి ఎన్నికలపై విమర్శలు వెల్లువెత్తాయి .పౌర ముసుగులో మిన్ ఆంగ్ హ్లైంగ్ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసిన ఐదేళ్ల తర్వాత, యుద్ధంతో దెబ్బతిన్న ఈ దేశంలో రాజకీయ అధికారంపై తన పట్టును అధికారికం చేసుకుంటూ, మయన్మార్ సైనిక పాలకుడు మిన్ ఆంగ్ హ్లైంగ్ శుక్రవారం పార్లమెంటరీ ఓటు ద్వారా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 69 ఏళ్ల జనరల్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ పరిపాలనకు వ్యతిరేకంగా 2021లో ఒక తిరుగుబాటును నడిపించి, ఆమెను అరెస్టు చేశారు. ఇది విస్తృత నిరసనలకు దారితీసి, సైనిక పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సాయుధ ప్రతిఘటనగా రూపాంతరం చెందింది.
The post మ‌య‌న్మార్ అధ్య‌క్షుడిగా ఆర్మీ చీఫ్ ఎన్నిక‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వైఎస్సార్ పాద‌యాత్ర‌కు 23 ఏళ్లు : జ‌గ‌న్వైఎస్సార్ పాద‌యాత్ర‌కు 23 ఏళ్లు : జ‌గ‌న్

అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన పాద‌యాత్ర గురించి ప్ర‌స్తావించారు. గురువారం ఎక్స్ వేదిక‌గా గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా కీల‌క

Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్

Justice Suryakant : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు

Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలుAzam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు

    డబుల్‌ పాన్‌ కార్డు కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్‌ నేత ఆజంఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది. అబ్దుల్లా ఆజం అసలు పుట్టిన తేదీ 1993 జనవరి 1వ