hyderabadupdates.com Gallery మూలాపేట పోర్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

మూలాపేట పోర్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

మూలాపేట పోర్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి post thumbnail image

శ్రీ‌కాకుళం జిల్లా : శ్రీ‌కాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టు పురోగ‌తి ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రులు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, అచ్చెన్నాయుడు. సోమ‌వారం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మూలాపేట పోర్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంతరం పోర్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది చివరి నాటికి పోర్టు పనులను పూర్తి చేసి ఆపరేషన్లు ప్రారంభించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్ప‌ష్టం చేశారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణంతో శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల వాంఛ తీరనుందన్నారు. పోర్టు నిర్మాణంలో పెండింగ్ సమస్యలు ఇంకా ఇతర సమస్యలు పై కూడా చ‌ర్చించామ‌న్నారు. ఎప్పటిలోపు పనులు పూర్తిగా పూర్తవుతాయని ఆరా తీశామ‌న్నారు. దాదాపు రూ. 4361.91 కోట్లతో చేపట్టిన మూలాపేట పోర్టు పనుల్లోఫేజ్ 1 లో 1524 ఎకరాల్లో 4 బెర్త్ ల నిర్మాణం చేపట్టాం అన్నారు.
తొలుత 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ. భూ సేకరణ వంటి అనివార్య కారణాలతో 2026 నవంబర్ నాటికి పోర్టును ప్రారంభించాలన్న దృఢ నిశ్చయంతో పని చేస్తున్నాం అన్నారు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి , అచ్చెన్నాయుడు. మూలాపేట పోర్టు ఉత్తరాంధ్రలో వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉందన్నారు. ఈ పోర్టు నిర్మాణంతో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తీర ప్రాంతం లేని, సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్..దక్షిణ ఒడిస్సా ప్రాంతాలకు ఇది అత్యంత అందుబాటులో ఉండే పోర్టు కావడం కలిసొచ్చే అంశం అని చెప్పారు. మూలపేట పోర్టుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలకు వాస్తవాలు తెలియ జేయాల్సిన బాధ్యత తమపై ఉంద‌న్నారు.
The post మూలాపేట పోర్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

డ్రైవ‌ర్ కొడుక్కి టీవీకే అసెంబ్లీ టికెట్ వైర‌ల్డ్రైవ‌ర్ కొడుక్కి టీవీకే అసెంబ్లీ టికెట్ వైర‌ల్

చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌కీయాలు రోజు రోజుకు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఏప్రిల్ నెల‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు, తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమ‌య్యాడు టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ అలియాస్ జోసెఫ్ విజ‌య్. తాజాగా

వెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవితవెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవిత

అమరావతి : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంకన్న ఫొటోలను సభలో విచ్చలవిడిగా పడేసి అపచారానికి పాల్పడ్డారని, ఆ కలియుగ దైవం

రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాంరాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం

అమ‌రావ‌తి : రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా