hyderabadupdates.com Gallery యుద్దం ప్ర‌భావం అమెరికా ఆర్మీ చీఫ్ కు మంగ‌ళం

యుద్దం ప్ర‌భావం అమెరికా ఆర్మీ చీఫ్ కు మంగ‌ళం

యుద్దం ప్ర‌భావం అమెరికా ఆర్మీ చీఫ్ కు మంగ‌ళం post thumbnail image

అమెరికా : ఇరాన్ పై యుద్దం కొన‌సాగుతున్న వేళ అమెరికా ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా యుఎస్ ఆర్మీ చీఫ్ కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఈ మేర‌కు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏకంగా దేశ అత్యున్న‌త సైనికాధిప‌తికి ఉద్వాస‌న ప‌లికారు దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్‌తో భీకర యుద్ధం నడుస్తున్న సమయంలో కారణం చెప్పకుండా ఓ సైన్యాధ్యక్షుడ్ని తొలగించారంటే అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్మీచీఫ్‌ స్థానంలో తమకు విధేయుడైన వ్యక్తి రాబోతున్నారు. అంటే గత సైన్యాధ్యక్షుడు అడ్డు చెప్పిన నిర్ణయాల్ని అమలు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోందనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేకమంది ఉన్నతాధికారులను తొలగించారు. సైన్యంలో శరవేగంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీన్నిబట్టి చూస్తే వచ్చే 2 వారాలు యుద్ధం మరింత తీవ్రం కాబోతోందని స్పష్టం అవుతోంది. ఇరాన్ యుద్ధ సంక్షోభం మధ్య ఆర్మీ చీఫ్‌ను తొలగించ‌డం చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పదవి నుంచి వైదొలగమని కోరడంతో, అమెరికా రక్షణ శాఖ ఆర్మీ చీఫ్ రాండీ జార్జ్‌ను తొలగించింది. ఈ చర్య అమల్లో ఉన్నంత వరకు క్రిస్టోఫర్ లానెవ్‌ను తాత్కాలిక చీఫ్‌గా నియమించారు. ఇదిలా ఉండ‌గా జనరల్ రాండీ ఎ. జార్జ్ 41వ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి తక్షణమే పదవీ విరమణ చేయనున్నారంటూ పెంట‌గాన్ ప్ర‌తినిధి సీన్ పార్నెల్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.
The post యుద్దం ప్ర‌భావం అమెరికా ఆర్మీ చీఫ్ కు మంగ‌ళం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వేద విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు కృషి చేయాలివేద విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు కృషి చేయాలి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో కొలువు తీరిన‌ శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు. శ్రీ ఎస్వీ వేద పాఠశాలకు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం

P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలుP Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

    మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో 1984లో జరిపిన ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ పై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం

KCR: మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్KCR: మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్

KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం బీఫాం అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్. ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్