hyderabadupdates.com movies రామాయణ – ఆరు గంటల అసలైన సవాల్

రామాయణ – ఆరు గంటల అసలైన సవాల్

ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్. నాలుగు వేల కోట్లతో తీశారు కాబట్టి మతిపోయే స్థాయిలో ఉంటుందని ప్రిపేర్ అయిన ప్రేక్షకులకు అందులో కంటెంట్ షాక్ ఇచ్చింది. క్వాలిటీ తక్కువ విఎఫ్ఎక్స్, ఏఐ వాడకం, సరిగా కట్ చేయని విజువల్స్ వెరసి ఊహించని విధంగా ట్రోలింగ్ కు దారి తీసింది. ఇది వచ్చాక ఆదిపురుష్ ఓంరౌత్ ని ఒక రౌండ్ వేద్దామనుకున్న మీమర్స్ హఠాత్తుగా రూటు మార్చాల్సి వచ్చింది.

సరే దాని సంగతి పక్కనపెడితే టీజర్ లాంచ్ సందర్భంగా రన్బీర్ కపూర్ రామాయణ నిడివిని రివీల్ చేశాడు. ఒక విదేశీ జర్నలిస్టుతో మాట్లాడుతూ మీరు చూసింది కేవలం శాంపిలేనని, అసలైన ఆరు గంటల అద్భుతమైన కంటెంట్ తమ దగ్గర ఉందని అన్నాడు. ఇప్పుడు సవాల్ ఇదే. రన్బీర్ చెప్పింది రెండు భాగాలు కలిపిన నిడివే అయినా ఇప్పటికే కొన్ని వందలసార్లు చూసిన కథను మళ్ళీ అంత లెన్త్ తో చూపిస్తే జెన్ జీ ఆడియన్స్ ఓపికగా చూస్తారానే ప్రశ్న తలెత్తుతుంది.

ఒకప్పుడు తొంభై దశకంలో రామాయణ సీరియల్ అన్ని ఎపిసోడ్ల నిడివి 45 గంటలు. జనం బ్రహ్మరథం పట్టారు. శోభన్ బాబు సంపూర్ణ రామాయణం మూడు గంటల పది నిముషాలు ఉంటుంది. బ్లాక్ బస్టర్ చేశారు. లవకుశ మూడున్నర గంటలకు పైనే ఉన్నా అణా పైసా టికెట్ రేట్లతోనే కోట్లు కొల్లగొట్టింది. కానీ ఇప్పటి తరం వేరు. బాపు గారు శ్రీరామరాజ్యంని గొప్పగా తీసినా ఎబోవ్ యావరేజ్ అయ్యింది. ఇక ఆదిపురుష్ సంగతి సరేసరి. ప్రభాస్ అభిమానులే తిరస్కరించారు.

రామాయణ ఈ సవాళ్లు అన్నీ ఎదురుకోవాలి. గ్రాఫిక్స్ నెవెర్ బిఫోర్ అనేలా ఉంటాయని బాకాలు ఊడడం బాగానే ఉంది కానీ ఆ ఫీల్ ని టీజర్ ట్రైలర్ స్థాయిలోనే ఆడియన్స్ ఫీలవ్వాలి. అంతే తప్ప ఏముందనే భావన రాకూడదు. రామాయణ టీమ్ ముందైతే క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలి. ఎలివేషన్ల ట్రెండ్ లో ఊగిపోతున్న ఇప్పటి జనరేషన్ ని సీతారాముల కథతో రెండు భాగాలుగా ఆరు గంటలు మెప్పించడం కత్తి మీద సామే. మరి దర్శకుడు నితేశ్ తివారి దానికి ఎలాంటి బదులు ఇస్తారో.

Related Post

Queen Title Glimpse Sparks Curiosity as Yamini ER Makes Her Heroine DebutQueen Title Glimpse Sparks Curiosity as Yamini ER Makes Her Heroine Debut

The title glimpse of the upcoming Telugu film Queen was unveiled on Valentine’s Day, instantly drawing attention for its unusual concept and strong social theme. The film marks the heroine