hyderabadupdates.com Gallery రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం

రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం

రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని, ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రానికి ఇప్పటి వరకు వచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాలతో పాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో యువతకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాల కల్ప‌నే త‌మ స‌ర్కార్ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కంకణ బద్దులై పని చేయాల‌న్నారు. నైపుణ్యం పోర్టల్ మాదిరిగానే ప్రతిఒక్క ఉద్యోగాన్ని ఆధార్/కేవైసీ లింకేజీతో ట్రాక్ చేయాలని ఆదేశించారు. త‌మ‌మ‌ దృష్టిలో చిన్న పరిశ్రమలు, పెద్ద పెట్టుబడులు రెండూ సమానమేన‌ని అన్నారు. ఉద్యోగాల కల్పనే మాకు ముఖ్యం అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. పరిశ్రమల స్థాపన, అనుమతుల విషయంలో సింగపూర్, దుబాయ్ కంటే సులభతరంగా ఉండాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని శాఖలవారీ అనుమతులు, ఎన్వోసీలను మ్యాపింగ్ చేసి వాటి స్థితి, గడువు ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన మాటను నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన చంద్ర‌బాబు నాయ‌క‌త్వం, కేంద్రం స‌హ‌కారంతో త్వ‌రలోనే అనుకున్న టార్గెట్ ను పూర్తి చేస్తామ‌న్నారు.
The post రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వటపత్రశాయి అలంకారంలో జనహిత రాముడువటపత్రశాయి అలంకారంలో జనహిత రాముడు

ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన

అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు : సీఎంఅన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు : సీఎం

ప‌ల్నాడు జిల్లా : పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్నార్తుల ఆకలి

మా అధినాయ‌కుడిని తిడితే మేం ఊరుకోవాలా..?మా అధినాయ‌కుడిని తిడితే మేం ఊరుకోవాలా..?

అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీకి చెంగిన గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గ‌ళ్లా మాధ‌వి నిప్పులు చెరిగారు. వైసీపీ బాస్ జ‌గ‌న్ రెడ్డి, ఆయ‌న ప‌రివారాన్ని ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి