hyderabadupdates.com Gallery రూ.225 కోట్ల‌తో బాస‌ర ఆల‌య పునః నిర్మాణం

రూ.225 కోట్ల‌తో బాస‌ర ఆల‌య పునః నిర్మాణం

రూ.225 కోట్ల‌తో బాస‌ర ఆల‌య పునః నిర్మాణం post thumbnail image

హైద‌రాబాద్‌: ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఏకైక జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యం.. అక్ష‌రాభాస్యాల‌కు ఆల‌వాల‌మైన క్షేత్రం పునః నిర్మాణంతో కొత్త శోభ‌ను సంత‌రించు కోబోతోంది. వేద వ్యాస మ‌హ‌ర్షితో ప్ర‌తిష్ట‌త‌మైన ముగ్గురు అమ్మల ఆల‌యం ఆచారాల‌కు అనుగుణంగా సమున్నత‌మైన రాజ‌గోపురం.. కోనేరు.. ఉత్తర ద్వారం అభివృద్ధి.. ధ్యాన మందిరాలతో మ‌రింత‌గా భ‌క్తుల మ‌నస్సుల‌ను ఆకట్ట‌కోనుంది. వేల ఏళ్ల ఘ‌న చ‌రిత్ర గ‌ల్గిన బాసర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌య పునః నిర్మాణాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.225 కోట్ల‌ను కేటాయించింది.
ద‌క్షిణ గంగగా గుర్తింపు పొందిన ప‌విత్ర గోదావ‌రి న‌దీ తీరంలోని బాస‌ర క్షేత్రంలో జ్ఞాన స‌ర‌స్వ‌తి దేవి కొలువై ఉన్నారు.. కురుక్షేత్ర యుద్ధానంత‌రం ప్ర‌శాంత‌త కోసం వేద వ్యాస మ‌హ‌ర్షి గోదావ‌రి తీరానికి వ‌చ్చి బాస‌ర‌లో నివ‌సించార‌ట‌.. ఆ స‌మ‌యంలో స్వ‌యంగా ఆయ‌నే గోదావ‌రి ఇసుక‌తో జ్ఞాన స‌ర‌స్వ‌తితో పాటు మ‌హా ల‌క్ష్మి, మ‌హా కాళి అమ్మ వార్ల మూర్తుల‌ను ప్ర‌తిష్టించార‌నేది స్థ‌ల పురాణం.. అలా ముగ్గురమ్మ‌ల కొలువైన క్షేత్రంగా బాస‌ర ప్ర‌సిద్ధి చెందింది.
జ్ఞాన స‌ర‌స్వ‌తి కొలువైన క్షేత్రం కావ‌డంతో ప్ర‌తి ఏటా పెద్ద సంఖ్య‌లో పిల్ల‌ల‌కు ఇక్క‌డ అక్ష‌రాభ్యాసాలు చేయిస్తుంటారు. వ‌సంత పంచ‌మి, ఇత‌ర ప‌ర్వ దినాల్లో అక్ష‌రాభ్యాసాల‌కు వ‌చ్చే పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు, వారి బంధువులు, భ‌క్తుల‌తో ఆల‌యం కిట‌కిట‌లాడుతుంది. ప్రాచీన ఆల‌యం కావ‌డం.. ఏటేటా పెరుగుతున్న భ‌క్తుల సంఖ్య‌కు త‌గిన‌ట్లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌క పోవ‌డంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.. ఈ నేప‌థ్యంలో బాస‌ర ఆల‌య అభివృద్ధి చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంక‌ల్పించారు. సంప్ర‌దాయాలు, ఆచారాల‌కు అనుగుణంగా ఆల‌య అభివృద్ధి ప‌నులు చేప‌ట్టేందుకు మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.
The post రూ.225 కోట్ల‌తో బాస‌ర ఆల‌య పునః నిర్మాణం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదుటీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదు

చెన్నై : అస‌లైన కాంగ్రెస్ పార్టీ త‌మ‌తోనే ఉందంటూ కామెంట్స్ చేసిన టీవీకే పార్టీ అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ పై నిప్పులు చెరిగారు కర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే

TG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదంTG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం

    జీహెచ్‌ఎంసీని (GHMC) విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న

మేం పాలకులం కాదు సేవకులం : సీఎంమేం పాలకులం కాదు సేవకులం : సీఎం

హైద‌రాబాద్ : తాము పాల‌కులం కామ‌ని, కేవ‌లం ప్ర‌జా సేవ‌కులం మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. గురువారం స‌చివాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర మంతటా గ్రామ