hyderabadupdates.com movies ‘రెడ్ బుక్ కు నా కుక్క కూడా భయపడదు’

‘రెడ్ బుక్ కు నా కుక్క కూడా భయపడదు’

రెడ్ బుక్ ను చూస్తే వైసీపీ నేతలు వణికిపోతున్నారని, రకరకాల సాకులు చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారని మంత్రి లోకేశ్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం మాత్రమే శిక్షిస్తామని, అటువంటి వారి పేర్లే రెడ్ బుక్ లో ఉన్నాయని లోకేశ్ చెప్పారు.

ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ పై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ చూసి తాను కాదు కదా..తన ఇంట్లో కుక్కలు కూడా భయపడబోవని అన్నారు.

ఇక, రెడ్ బుక్ లో తన పేరుందో లేదో చెప్పాల్సింది లోకేశ్ అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అంబటి జవాబిచ్చారు. రెడ్ బుక్ లో తన పేరుతో పాటు ఇంకా చాలా పేర్లున్నాయని ఆ బుక్ రాసిన పెద్దమనిషి చెబుతున్నాడని లోకేశ్ ను ఉద్దేశించి సెటైర్లు వేశారు.

రెడ్ బుక్ ను తన కుక్క కూడా లెక్కచేయదని ఆల్రెడీ చెప్పానని అన్నారు. రాజశేఖర రెడ్డి వెంట నడిచినవాళ్లమని, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్నవాళ్లమని, ఈ రెడ్ బుక్ లు, పిచ్చి బుక్ లకు తాము భయపడబోమని చెప్పారు.

లోకేశ్ కు ఏం తెలుసని, అర్ధాంతరంగా రాజకీయాల్లోకి వచ్చాడని అంబటి విమర్శించారు. సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడని, లోకేశ్ కు రాజకీయ అనుభవం లేదని ఎద్దేవా చేశారు. రాబోయే కాలంలో టీడీపీ పతనానికి లోకేశే నాంది కాబోతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి, అంబటి వ్యాఖ్యలకు లోకేశ్ కౌంటర్ ఏవిధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Post

కల్తీ లడ్డు వివాదం: ప్రజలకు పిలుపునిచ్చిన పవన్కల్తీ లడ్డు వివాదం: ప్రజలకు పిలుపునిచ్చిన పవన్

మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. సిట్ నివేదికను వైసీపీ తప్పుదారి పట్టిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోందని కూటమి

సుధీర్ బాబుకి జటిలమైన పరీక్షసుధీర్ బాబుకి జటిలమైన పరీక్ష

ఈ వారం విడుదలవుతున్న వాటిలో బడ్జెట్ పరంగా పెద్ద సినిమా జటాధరనే. సుధీర్ బాబు హీరోగా రూపొందిన ఈ హారర్ కం డివోషనల్ డ్రామా కోసం బాలీవుడ్ నిర్మాతలు గట్టిగానే ఖర్చు పెట్టారు. ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే

గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..

ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. గోవా వెళ్లాలంటేనే జనం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా