hyderabadupdates.com movies విస్మయపరిచే ‘రామ’ పరిచయం

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా రాముడి పాత్ర  పరిచయంతో విడుదల చేశారు. కథగా చెప్పేందుకు కొత్త విషయం లేదు కానీ విజువల్స్ తోనే తమ విజన్ ఏ స్థాయిలో ఉందో చూపెట్టేందుకు ప్రయత్నించారు దర్శకులు నితేష్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రా. కేవలం రాముడిని చూపించే కాన్సెప్ట్ కాబట్టి ఇతర ఆర్టిస్టులను రివీల్ చేయలేదు.

ప్రపంచంలోనే అత్యున్నత విఎఫ్ఎక్స్ కంపెనీల్లో ఒకటైన డిఎన్ఈజి ఈ రామాయణలో భాగస్వామ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 8 ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న ఈ సంస్థ ఎప్పుడూ చూడని గ్రాఫిక్స్ ని ఈ ఎపిక్ డ్రామాలో చూపించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇక వీడియో విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్, జిమ్స్ హ్యామర్ నేపధ్య సంగీతంలో ప్రతి క్షణం ఎలివేట్ అయ్యే స్థాయిలో అబ్బురపరిచే దృశ్యాలు రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు కట్టిపడేస్తాయి.

నాలుగు వేల కోట్ల బడ్జెట్ అంటున్నారు కాబట్టి ఆ స్థాయిలో అనిపించాయా అంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది కేవలం శాంపిల్ మాత్రమే. రుచి చెప్పడానికి ఒక్క మెతుకు సరిపోతుంది కానీ ఇలాంటి కంటెంట్ విషయంలో తొందరపడి ఎలాంటి జడ్జ్ మెంట్లు ఇవ్వలేం. పైగా రిలీజ్ ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి పరిమితంగా సీన్స్ చూపించాలన్న ఉద్దేశంతో కట్ చేసిన విధానం ఎన్నో విషయాలను దాచి పెట్టిందన్నది వాస్తవం.

డేట్ ఇంకా నిర్ధారణగా చెప్పకపోయినా ఇదే సంవత్సరం దీపావళికి విడుదల కావడం పక్కా. మరోసారి దాన్ని టీజర్ లో నొక్కి చెప్పారు. సాయిపల్లవి సీతగా, యాష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న రామాయణ ఇకపై ఎవరూ ఇంత గొప్పగా రామకథను చెప్పలేరన్న రీతిలో నితేశ్ తివారి తెరకెక్కిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఈ స్థాయి అంచనాలను నిలబెట్టుకోగలిగితే వరల్డ్ వైడ్ వసూళ్లతో పెట్టిన పెట్టుబడి రికవరీ చేసుకోవచ్చు. అదే జరిగితే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్టే.

Related Post

“మేమే కొట్టాం.. రెడ్ ఫోర్ట్ బాంబ్ మా పనే!” పాక్ నేత ఓపెన్ స్టేట్‌మెంట్!“మేమే కొట్టాం.. రెడ్ ఫోర్ట్ బాంబ్ మా పనే!” పాక్ నేత ఓపెన్ స్టేట్‌మెంట్!

ఢిల్లీ ఎర్రకోట వద్ద 15 మందిని బలితీసుకున్న కారు బాంబు పేలుడు వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ చెబుతూనే ఉంది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ, ఒక పాక్ నాయకుడు ఓపెన్‌గా ఒప్పుకోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పాక్ సీనియర్

థియేటర్లు సరిపోవట్లేదు మహాప్రభో !థియేటర్లు సరిపోవట్లేదు మహాప్రభో !

సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి తగ్గట్టు సర్దలేక డిస్ట్రిబ్యూటర్లు కిందా మీదా పడుతున్నారు. మన శంకరవరప్రసాద్ గారుకి అంచనాలకు మించిన బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో