hyderabadupdates.com movies శోభన్ సోదరులకు మంచి టైమ్ వచ్చినట్టే

శోభన్ సోదరులకు మంచి టైమ్ వచ్చినట్టే

సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ఈ రెండు పేర్లు చూసి ఇండస్ట్రీలో వాళ్లే అప్పుడప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొన్న రాకాస ఈవెంట్ లో కొందరు హీరో పేరు చెప్పబోయి హీరో అన్నయని గుర్తు చేసుకోవడం ఫన్నీగా అనిపించింది. ఇదలా ఉంచితే శోభన్ బ్రదర్స్ కు మంచి టైం మొదలైనట్టుంది. ముందు సంతోష్ విషయానికి వస్తే చాలా సంవత్సరాలుగా హిట్టు కోసం ఎంత పరితపించిపోతున్నాడో చూస్తున్నాం. కుర్రాడిలో టాలెంట్ కు లోటు లేకపోయినా సక్సెస్ లేక వెనుకబడ్డాడు.

ఫిబ్రవరిలో విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ సంతోష్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. అదిరిపోయే బ్లాక్ బస్టర్ అనలేం కానీ ఉన్నంతగా నెగటివ్ అనిపించుకోకుండా ఏ సెంటర్స్ వసూళ్లతో డీసెంట్ గా గట్టెక్కింది. తన మీద పెట్టుబడి పెట్టొచ్చనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగించింది. అంతకు ముందు అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్, శ్రీదేవి శోభన్ బాబు, కళ్యాణం కమనీయం, లైక్ షేర్ సబ్స్క్రైబ్ రూపంలో సంతోష్ శోభన్ చేసినవి కలలో కూడా మర్చిపోలేని అల్ట్రా ఫ్లాపులు.

ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే కెరీర్ ని చక్కదిద్దుకుంటున్నాడు. మ్యాడ్ తో వచ్చిన పేరు మ్యాడ్ స్క్వేర్ తో నిలబడిపోగా దాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో కథ ఎంపిక గురించి జాగ్రత్తగా ఉంటున్నాడు. కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే సంగీత్ టాలీవుడ్ మిస్సవుతున్న కామెడీ మూవీస్ కి మంచి ఆప్షన్ అయ్యేలా ఉన్నాడు. అల్లరి నరేష్ దూకుడు ఇప్పుడు లేదు కాబట్టి ఆ స్థానాన్ని అందిపుచ్చుకోవడానికి సంగీత్ కు బోలెడు అవకాశాలు వస్తాయ్.

తాజాగా రాకాస బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. పూర్తిగా కొత్త కథ కాకపోయినా, కొన్ని లాజిక్స్ లేకపోయినా బోర్ కొట్టలేదన్న తరహాలో ఫీడ్ బ్యాక్ రావడంతో మాస్ ప్రేక్షకుల సపోర్ట్ రాకాసకే కనిపిస్తోంది. బైకర్ ఎమోషనల్ డ్రామా కావడంతో దానికి వెళ్లే ఆడియన్స్ వేరుగా ఉంటున్నారు. ఇకపై సంతోష్, శోభన్ తాము చేయబోయే సినిమాల పట్ల ఇంకాస్త కేర్ తీసుకోవాలి. వీళ్ళ తండ్రి శోభన్ ప్రభాస్ వర్షం, రవితేజ చంటి లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి చిన్న వయసులోనే చనిపోయిన సంగతి తెలిసిందే.

Related Post

Top Highest Grossing Hindi Films in India: Dhurandhar The Revenge tops with Rs. 800 CrTop Highest Grossing Hindi Films in India: Dhurandhar The Revenge tops with Rs. 800 Cr

Dhurandhar: The Revenge has emerged as the highest-grossing Hindi film of all time in India, collecting Rs. 800.50 crore nett approx, in fifteen days of release. The Ranveer Singh starrer