hyderabadupdates.com Gallery శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు

శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు

శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు post thumbnail image

తిరుమల: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కీల‌క మార్పులు చేసింది. గతంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించింది. ఈ నుంచి భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10వేలు విరాళంతోపాటు, వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ కు కూడా రూ.500 కలిపి ఒకేసారి రూ.10,500 చెల్లించే అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన పేమెంట్ గేట్ వే లావాదేవీలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. ఇందుకోసం భక్తులు యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లో చెల్లింపులు చేసేలా నిర్ణ‌యం తీసుకుంది టీటీడీ.
ఇక శ్రీ‌వాణి టికెట్ల విష‌యానిక వ‌స్తే కరెంట్ బుకింగ్ కోటా కింద ప్రతిరోజూ 800 టికెట్లను ఏరోజుకారోజు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ వేదిక‌గా టికెట్లు విడుద‌ల చేస్తారు. ఈ విధానంలో 1+3 భక్తులకు మాత్రమే టికెట్ బుకింగ్ అనుమతి ఇస్తున్నారు. ఒక ఐడీపై ఒకసారి టికెట్ పొందితే వారం రోజుల పాటు టికెట్ పొందడానికి వీలుపడ‌ద‌ని, ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని స్ప‌ష్టం చేసింది టీటీడీ.
ఇప్పటి వరకు భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10000 విరాళం ఇచ్చి, ఇతర వివరాలు నమోదు చేసి రూ.500 చెల్లించేలోపు టిక్కెట్లు అయిపోయినట్లు ఫిర్యాదులు అందేవి. అప్పటికే శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10వేలు విరాళం ఇచ్చిన భక్తులు రూ.500 చెల్లించి టికెట్లను కొనుగోలు చేసేవారు. దీంతో కరెంట్ బుకింగ్ లో ట్రస్టుకు సంబంధించి విరాళం అందించినవారు ఇబ్బంది ఏర్పడినట్లు ఫిర్యాదులు అందాయి. వీటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క మార్పులు చేసింది.
The post శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Dr Shaheen: పుల్వామా మాస్టర్‌మైండ్‌ తో డాక్టర్ షహీన్‌ కు లింకులు ?Dr Shaheen: పుల్వామా మాస్టర్‌మైండ్‌ తో డాక్టర్ షహీన్‌ కు లింకులు ?

      ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్‌పై ఎన్‌ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ ఉమర్ ఫారుక్‌ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ధురంధ‌ర్. పాకిస్తాన్ లో ఇండియ‌న్ ఆఫీస‌ర్ గూఢ‌చారిగా వ్య‌వ‌హ‌రించిన క‌థ‌నం ఆధారంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా విడుద‌లైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంది. ఏకంగా రూ. 1000

సంజు శాంస‌న్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిసంజు శాంస‌న్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ అజింక్యా ర‌హానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి. తాజాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో స‌త్తా చాటాడు.