hyderabadupdates.com Gallery సంజూ శాంస‌న్ క్లాస్ శాశ్వ‌తం : శ‌శి థ‌రూర్

సంజూ శాంస‌న్ క్లాస్ శాశ్వ‌తం : శ‌శి థ‌రూర్

సంజూ శాంస‌న్ క్లాస్ శాశ్వ‌తం : శ‌శి థ‌రూర్ post thumbnail image

కేర‌ళ : త‌మ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పై స్పందించారు తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్. ఆదివారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. తాజాగా స్వ‌దేశంలో న్యూజిలాండ్ జ‌ట్టుతో జ‌రిగిన టి20 సీరీస్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్బంగా కేవ‌లం మొత్తం సీరీస్ ఆడినా శాంస‌న్ కేవ‌లం 50 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నాడు. త‌ను చూసిన క్రికెట‌ర్ల‌లో త‌న‌కు ఇష్ట‌మైన వారిలో శాంస‌న్ టాప్ లో ఉంటాడ‌ని తెలిపాడు. అయితే ఆట , క్లాస్ అనేది శాశ్వ‌తం అన్నాడు. ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ నుంచి నెంబ‌ర్ 10 దాకా పేరు పొందిన ఆట‌గాళ్లంతా ఏదో ఒక సారి ఫామ్ కోల్పోయిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయ‌న్నాడు శ‌శి థ‌రూర్.
త‌న‌కు పూర్తిగా సంజూ శాంస‌న్ ఫామ్ పై న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. త‌ను ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడ‌టం త‌ప్ప‌ద‌న్నాడు ఎంపీ. ప్ర‌స్తుతం త‌న‌కు బ్యాడ్ ల‌క్ స్టార్ట్ అయ్యింద‌ని, ఇది కొంత కాలం మాత్ర‌మే ఉంటుందన్నాడు. ఇదిలా ఉండ‌గా తిరువ‌నంత‌పురం లో జ‌రిగిన మ్యాచ్ లో శాంస‌న్ కేవ‌లం ఆరు ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇషాన్ కిష‌న్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. దీంతో హెడ్ కోచ్ గంభీర్ ఇషాన్ కిష‌న్ ను వికెట్ కీప‌ర్ గా ప్ర‌మోట్ చేశాడు. త‌న స్థానం నుంచి త‌ప్పించారు శాంస‌న్ ను. త‌న‌ను కేవ‌లం గ్రౌండ్ లో ఆట‌గాడిగా మాత్ర‌మే ఉప‌యోగించు కున్నాడు. దీంతో రాబోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో శాంస‌న్ కు చోటు లేద‌ని తేలి పోయింది.
The post సంజూ శాంస‌న్ క్లాస్ శాశ్వ‌తం : శ‌శి థ‌రూర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !

  విమాన ప్రయాణాలు చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. విజయవాడ-సింగపూర్‌ మార్గంలో నవంబర్‌ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్‌ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లాలనుకునే ప్రయాణికులకు

మెరిసిన భార‌త్ చేతులెత్తేసిన న్యూజిలాండ్మెరిసిన భార‌త్ చేతులెత్తేసిన న్యూజిలాండ్

నాగ్ పూర్ : టి20 సీరీస్ లో భాగంగా నాగ్ పూర్ లోని విద‌ర్భ స్టేడియంలో జ‌రిగిన తొలి కీల‌క మ్యాచ్ లో సూర్య భాయ్ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు స‌త్తా చాటింది. వ‌చ్చే నెల‌లో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా ఐసీసీ

IPS officer: హరియాణా ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటుIPS officer: హరియాణా ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు

IPS officer : హరియాణాలోని సీనియర్‌ ఐపీఎస్ అధికారి పూరన్‌ కుమార్‌ (Pooran Kumar) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.