hyderabadupdates.com Gallery సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రస్థానం సీఎం సంతోషం

సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రస్థానం సీఎం సంతోషం

సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రస్థానం సీఎం సంతోషం post thumbnail image

అమరావతి : సూక్ష్మ సేద్యం ప‌థ‌కం ( మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి, రికార్డు స్థాయిలో 1,26,057 హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకువచ్చిన అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ తర్వాత 1.05 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ సాగుతో గుజరాత్ రెండో స్థానంలో ఉందన్నారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు చేసిన కృషిని కొనియాడారు. ఈ పథకాన్ని వినియోగించు కుంటున్న 1,08,143 మంది రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక సాగు పద్ధతుల ద్వారా వారికి నాణ్యమైన దిగుబడి, అధిక లాభాలు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ముఖ్యంగా డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను అవలంభిస్తున్న రైతులకు నీటి పొదుపుతో పాటు సాగు ఖర్చు తగ్గి, ఆర్థికంగా నిలదొక్కు కుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టమాటా, ఆయిల్ పామ్, మిర్చి వంటి పంటల నుంచి పప్పు ధాన్యాల వరకు వైవిధ్యమైన పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా రూ. 1030 కోట్ల మేర సబ్సిడీని రైతులకు అందించామన్నారు. మైక్రో ఇరిగేషన్‌ను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ.. అర్హులైన ప్రతి రైతుకూ సకాలంలో సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని వేల హెక్టార్లను సాగులోకి తెచ్చి, ఏపీని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
The post సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రస్థానం సీఎం సంతోషం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ajit Pawar: మహారాష్ట్ర మంత్రుల మెడకు భూ కుంభకోణం ఉచ్చు ?Ajit Pawar: మహారాష్ట్ర మంత్రుల మెడకు భూ కుంభకోణం ఉచ్చు ?

    మహారాష్ట్రలో మంత్రులకు సంబంధం ఉన్న భూమి కొనుగోలు వ్యవహారాలు వెలుగులోకి రావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇవి కేవలం కొనుగోళ్లు కావని, కుంభకోణాలంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, రవాణా మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌లపై ఆరోపణలు వస్తున్నాయి. తొలుత

NDA: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంNDA: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం

    ఉత్కంఠ భరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 సీట్లలో పోటీ చేసిన ఎన్డీఏ కూటమి దాదాపు 203 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

టీటీడీలో పాలసీ ఆధారిత పాలన : అడిష‌న‌ల్ ఈవోటీటీడీలో పాలసీ ఆధారిత పాలన : అడిష‌న‌ల్ ఈవో

తిరుమ‌ల : టీటీడీలో పాల‌సీ ఆధారిత పాల‌న సాగిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు టీటీడీ అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి. సోమ‌వారం 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. టీటీడీ కూడా ఒక పురాతన, మహత్తర