hyderabadupdates.com Gallery హార్వ‌ర్డ్ స్కూల్ నుంచి సీఎంకు స‌ర్టిఫికెట్

హార్వ‌ర్డ్ స్కూల్ నుంచి సీఎంకు స‌ర్టిఫికెట్

హార్వ‌ర్డ్ స్కూల్ నుంచి సీఎంకు స‌ర్టిఫికెట్ post thumbnail image

అమెరికా : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి అమెరికా లోని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన హార్వ‌ర్డ్ కెన్న‌డీ స్కూల్ లో గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న కోర్సులో జాయిన్ అయ్యారు. అంత‌కు ముందు స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో జ‌రిగిన ప్ర‌త్యేక ఆర్థిక స‌ద‌స్సు 2026లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధులు, ఎండీలు, చైర్మ‌న్లతో ముచ్చ‌టించారు. అక్క‌డి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన హార్వ‌ర్డ్ కెన్న‌డీ స్కూల్ లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 21వ శతాబ్దంలో నాయకత్వం అనే అంశంపై కోర్సు దిగ్విజ‌యంగా పూర్తి చేశారు అనుముల రేవంత్ రెడ్డి. ఇందులో ప్ర‌పంచంలోని 20 దేశాల నుండి 60 మందికి పైగా విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఇందులో పూర్తి కాలం కోర్సును చ‌దువుతున్న వారు ఉండ‌గా మ‌రికొంద‌రు స్వ‌ల్ప‌కాలిక కోర్సును అభ్య‌సిస్తున్నారు.
వీరంద‌రితో పాటే స్వ‌ల్ప‌కాలిక కోర్సును పూర్తి చేశారు సీఎం. ఈ సంద‌ర్భంగా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు రేవంత్ రెడ్డి. అసాధారణ ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుండి మాత్రమే కాకుండా, తోటి విద్యార్థుల నుండి కూడా పాఠాలు నేర్చుకోవడం మ‌రిచి పోలేని అనుభూతిని మిగిల్చింద‌ని పేర్కొన్నారు. ఇదంతా భయంకరమైన మంచు తుఫాను నేపథ్యంలో జరిగిందన్నారు సీఎం. ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడూ ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉండటం, 3 అడుగుల కంటే ఎక్కువ హిమపాతం, చలి గాలులు వీచాయన్నారు. ఈ కార్యక్రమం సమయంలో వివిధ పాఠశాలల్లో చదువుతున్న అద్భుతమైన విజయవంతమైన వ్యక్తులను కూడా కలిశానని తెలిపారు సీఎం. అయితే జనవరి 25 నుండి జనవరి 30 వరకు 6 రోజుల కోర్స్ కాగా, జనవరి 29 నాడే రేవంత్ రెడ్డికి సర్టిఫికెట్ ఇచ్చారని మీడియాకు షేర్ చేశారు సీఎం పీఆర్వో.
The post హార్వ‌ర్డ్ స్కూల్ నుంచి సీఎంకు స‌ర్టిఫికెట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలిగోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

హైద‌రాబాద్ : బాసర నుంచి భద్రాచలం వరకు ఒక టెంపుల్ సర్క్యూట్ గా దేవాల‌యాలను అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఆధ్యాత్మిక వైభవంతో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు త‌యారు

మార్చి 26 నుండి శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలుమార్చి 26 నుండి శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి/ఒంటిమిట్ట : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆల‌యంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి . ఇందులో భాగంగా ఆల‌యంలో మార్చి 24న

కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రంకోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం

అనంతపురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఆమె ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌న‌మిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. జాతీయ ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాల‌ని