hyderabadupdates.com Gallery 10న ఎంపీగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం

10న ఎంపీగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం

10న ఎంపీగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం post thumbnail image

బీహార్ : బీహార్ రాష్ట్ర చ‌రిత్ర‌లో అరుదైన రికార్డ్ సృష్టించారు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న‌కు రాష్ట్ర స‌ర్కార్ జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆయ‌న ఒప్పందంలో భాగంగా త‌ను కీల‌క‌మైన ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుండి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు. ఇదిలా ఉండ‌గా తాను రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఏప్రిల్ 10వ తేదీన ముహూర్తం ఖ‌రారు చేశారు. రాజ్య‌స‌భ‌లో స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ. త‌న వ‌య‌సు 75 ఏళ్లు. సుదీర్ఘ‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. త‌ను ఎన్నో మెట్ల‌ను ఎక్కి వ‌చ్చారు. అంతే కాదు బీహార్ లో సుదీర్ఘ కాలం పాటు సీఎంగా ప‌ని చేసిన రికార్డు కూడా త‌న‌పైనే ఉంది.
ఇదిలా ఉండ‌గా ఆదివారం నితీశ్ కుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌ను రాజ‌కీయంగా ఎదిగేందుకు బీహార్ తోడ్పాటు అందించింద‌ని పేర్కొన్నారు. బీహార్ శాసనసభలోని ఉభయ సభలలో, అలాగే పార్లమెంట్ ఉభయ సభలలో సభ్యుడిగా ఉండాలనే తన చిరకాల కోరికను ఆయన వ్యక్తం చేశారు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం గురించి బీహార్ బీజేపీ నాయకుడు సంజయ్ సరోగి ఆదివారం ధృవీకరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం, సరోగి కొత్త మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించిన మార్గసూచిని వివరించారు. పార్టీ సీనియర్ నాయకత్వం , మిత్రపక్షాలతో కూడిన సహకార విధానానికి ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ఎవ‌రు ఉండాలి ఎవ‌రు ఉండ కూడ‌ద‌నే దానిపై క‌లిసి కూర్చుని నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు.
The post 10న ఎంపీగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

హైద‌రాబాద్ : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ దురంధ‌ర్ -2 చిత్రం ఆశించిన దానికంటే దూసుకు పోతోంది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా సినీ విశ్లేష‌కులు సినిమా మూవీపై స్పందించారు. తాజాగా

స్వామి నాథ‌న్ జీవితం స్పూర్తి దాయ‌కంస్వామి నాథ‌న్ జీవితం స్పూర్తి దాయ‌కం

హైద‌రాబాద్ : భారత దేశ వ్య‌వ‌సాయ రంగానికి దివంగ‌త స్వామి నాథ‌న్ చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో భారతీయ వ్యవసాయ

చరిత్ర సృష్టించాల‌న్నా టీడీపీ తోనే సాధ్యంచరిత్ర సృష్టించాల‌న్నా టీడీపీ తోనే సాధ్యం

అమ‌రావ‌తి : దేశ రాజకీయాలపై ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీ టీడీపీనేన‌ని అన్నారు మంత్రి నారా లోకేష్‌. ఇవాళ టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్బంగా ఆయ‌న పార్టీ జెండా ఎగుర వేసి ప్ర‌సంగించారు. ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా 35