hyderabadupdates.com Gallery అంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు

అంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు

అంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీలో అంగ‌న్వాడీల నిర్వ‌హ‌ణ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 257 ఐసిడిఎస్ ప్రాజెక్టులు పరిధిలో 55746 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు. వీటిలో 21,756 అంగన్వాడి కేంద్రాలు సొంత భావనాల్లో 10, 566 కేంద్రాలు న‌డుస్తున్నాయ‌ని, ఇతర ప్రభుత్వ భవనాల్లో 23,424 అంగన్వాడీ కేంద్రాలు అద్ది భవనాల్లో నడుస్తున్నాయని మంత్రి వెల్ల‌డించారు.
వీటిలో 292 అంగన్వాడీ భవనాలు అసంపూర్తి దశలో ఉన్నాయని వీటిలో 948 అంగన్వాడి భవనాలు ముగింపు దశలో ఉండగా 873 స్లాబ్ స్థాయిలో 351 పైకప్పు స్థాయిలో 269 లింటెల్ స్థాయిలో 429 బేస్మెంట్ స్థాయిలో , 52 పునాది దశలో ఉన్నాయని సుధారాణి చెప్పారు.2,922 భవనాలను పూర్తి చేసేందుకు 193.92 కోట్ల రూపాయలు మంజూరుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వెల్ల‌డించారు. వీటిలో ముగింపు దశలో ఉన్న 948 భవనాల కోసం 48.52 కోట్లు ఉన్నాయని తెలిపారు. ముగింపు దశలో ఉన్న భవనాలను పూర్తి చేయడం కోసం ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింద‌ని స్ప‌ష్టం చేశారు.
2025 సంవత్సరంలో PM-JANMAN పథకం కింద 78 అంగన్వాడీ భవనాలు నిర్మాణం కోసం మూడు జిల్లాలు శ్రీకాకుళం, పార్వతిపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు 9.36 కోట్లు విడుదల చేసిన‌ట్లు పేర్కొన్నారు. అద‌న‌పు అంగ‌న్వాడీల కోసం మ‌రో నాలుగు కోట్లు రిలీజ్ చేశామ‌న్నారు. ఆరేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం ప్రీ-స్కూల్ విద్యా , ఆరోగ్య తనిఖీలను అందించడం జరుగుతుందని సుధారాణి చెప్పారు. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు ,బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్లతో 5జీ స్మార్ట్ ఫోన్ల‌ను అందించామని వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి అంగన్వాడి కేంద్రాలుగా మార్చామని తెలిపారు.
The post అంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Stalin: ఎస్‌ఐఆర్‌ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్‌ ఆగ్రహాంCM Stalin: ఎస్‌ఐఆర్‌ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్‌ ఆగ్రహాం

    ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్‌)కు మద్దతుగా అన్నాడీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించడం సిగ్గుచేటని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ విమర్శించారు. తన సొంత నియోజకవర్గం కొళత్తూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవాసులు సైతం తాము

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్

తిరుమల : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల బృందంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Amit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షాAmit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షా

    దిల్లీ పేలుడు ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడాలని ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఎర్రకోట సమీపంలో పేలుడు నేపథ్యంలో.. దేశ రాజధాని దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతపై నేడు ఉన్నతాధికారులతో