hyderabadupdates.com movies అంత బీజీలోనూ ప్రజాదర్బార్ కొనసాగించుతున్న మంత్రి లోకేష్

అంత బీజీలోనూ ప్రజాదర్బార్ కొనసాగించుతున్న మంత్రి లోకేష్

ప్రజల సమస్యలు వినడం మరియు పరిష్కార మార్గం చూపడంలో మంత్రి నారా లోకేష్ చొరవ చూపుతున్నారు. తాడేపల్లిలోనే కాదు ఎక్కడ ఉన్నా స్థానిక పార్టీ కార్యాలయాల్లో ప్రజాదర్బార్ నిర్వహించడం ఆయన పద్ధతిగా మారింది. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ 73వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.

విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో నిన్నంతా లోకేష్ బిజీగానే ఉన్నారు. సదస్సు తొలి రోజున విద్య మరియు ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రఖ్యాత కంపెనీలతో ఏపీ ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

రాత్రిపూట సదస్సుతో బిజీగా గడిపిన మంత్రి లోకేష్ ఈ రోజు ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి వినతులను స్వీకరించారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఇది ఆయన నిర్వహించిన డెబ్బై రెండవ ప్రజాదర్బార్. ఈ వినూత్న కార్యక్రమం ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఎక్కడ ప్రజాదర్బార్ జరిగినా జనం పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఇందుకు నిదర్శనం. ఒక ట్వీట్ చేస్తే కూడా లోకేష్ వెంటనే స్పందిస్తారనే నమ్మకం ప్రజల్లో పెరిగింది.

ఈ రోజు ప్రజాదర్బార్ లో పలువురు తమ సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చిననడిపిల్లి గ్రామానికి చెందిన బంగారి శ్రీనివాసరావు తమ 5.64 ఎకరాల వ్యవసాయ భూమిని కొంతమంది నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేయాలని కోరారు.

జీవీఎంసీలో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని మరియు తమకు అండగా నిలవాలని నీ తోడు సొసైటీ ఫర్ ట్రాన్స్ జండర్ పర్సన్స్ ప్రతినిధులు మంత్రి లోకేష్ ను కలిసి కోరారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సహాయం అందించాలని నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతానికి చెందిన కొప్పాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం మర్రిపాలెకు చెందిన ఎన్ నరసింహస్వామి తమ 3.10 ఎకరాల వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో మంచాల నాగేశ్వరరావు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు.

ఈ అన్ని విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మరియు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Related Post

సూప‌ర్ ఫ‌న్ కాంబో మ‌ళ్లీసూప‌ర్ ఫ‌న్ కాంబో మ‌ళ్లీ

యువ క‌థానాయ‌కుడు శ్రీ విష్ణు కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రం.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌. ఎక్కువగా సీరియ‌స్ సినిమాలు చేస్తూ వ‌చ్చిన అత‌ను.. ఈ సినిమా త‌ర్వాత ఎంట‌ర్టైన‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయాడు. త‌న చివ‌రి చిత్రం సింగిల్‌కు కింగ్ ఆఫ్ ఎంట‌ర్టైన్మెంట్ అని

Srinidhi Shetty – In Telusu Kada, we’ve explored a unique pointSrinidhi Shetty – In Telusu Kada, we’ve explored a unique point

Celebrity stylist Neerraja Kona is making her directorial debut with the romantic drama Telusu Kada, which features Siddhu Jonnalagadda, Raashii Khanna, and Srinidhi Shetty in the lead roles. The promotional

ధర్మల్ డ్రోన్ తో ‘పుష్ప’లపై నిఘా!ధర్మల్ డ్రోన్ తో ‘పుష్ప’లపై నిఘా!

‘అడవిలో ఎలాంటి అలికిడి, అలజడి గుర్తించినా, రక్షణ దళాలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. అక్రమార్కుల ఆట కట్టించాలి..’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్ర చందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి