hyderabadupdates.com movies అందులో ఆ రెండు రాష్ట్రాలను దాటేసిన ఏపీ

అందులో ఆ రెండు రాష్ట్రాలను దాటేసిన ఏపీ

దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను దాటి పారిశ్రామిక వృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు.

పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, వేగవంతమైన నిర్ణయాలు, పరిశ్రమల ఏర్పాటుకు సులభమైన వాతావరణమే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా దూసుకెళ్తోందని, రానున్న రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫోర్బ్స్ ఇండియా కథనాన్ని లోకేష్ ట్యాగ్ చేశారు. దీని ప్రకారం, దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ప్రకటించిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాను ఏపీ దక్కించుకుంది. దీంతో దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది..ఈ జాబితాలో ఒడిశా 13.1 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 12.8 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది.

ఈ మూడు రాష్ట్రాలకు కలిపి మొత్తం పెట్టుబడుల్లో 51.2 శాతం కేంద్రీకృతమవడం గమనార్హం. ఇది దేశంలోని పారిశ్రామిక పెట్టుబడులు తూర్పు, దక్షిణ రాష్ట్రాల వైపు మళ్లుతున్నాయన్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అదేవిధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా పెట్టుబడి ప్రకటనలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5 శాతం పెరిగి రూ. 26.6 లక్షల కోట్లకు చేరినట్లు ఫోర్బ్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడుతున్నదనానికి నిదర్శనంగా పేర్కొంది.

Related Post

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆ నమ్మకం ఓడిపోయింది. దాదాపు ఆరేళ్ల (2,462 రోజులు) తర్వాత.. కోహ్లీ సెంచరీ కొట్టినా భారత్ ఓడిపోయిన అరుదైన

రాజ్యాంగం వల్లే ప్రధానిగా ఛాయ్ వాలా!రాజ్యాంగం వల్లే ప్రధానిగా ఛాయ్ వాలా!

భారత రాజ్యాంగం ఎంతో గొప్పది… బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన ఈ అత్యున్నత రాజ్యాంగం వల్ల ఛాయ్ వాలా దేశానికి ప్రధాని కాగలిగారు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన