hyderabadupdates.com movies అక్కినేని అభిమానులు హ్యాపీ కాదా?

అక్కినేని అభిమానులు హ్యాపీ కాదా?

సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే పై ప్రశ్నకు ఔననే సమాధానం వస్తుంది. లెనిన్ కొత్త విడుదల తేదీని జూన్ 26కి ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు భగ్గుమంటున్నారు. వాళ్ళ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. లెనిన్ మే 1 వస్తుందని ముందు నుంచి బలంగా నమ్మారు. ఇప్పుడు పెద్ది ఏప్రిల్ 30 వస్తుంది కాబట్టి దాని కోసం త్యాగం చేశామనే రీతిలో నిర్మాతలు వివరణ ఇవ్వడంతో వాళ్లకు కన్విన్సింగ్ గా అనిపించడం లేదు. ఎందుకో చూద్దాం.

లెనిన్ ఇంకొంత భాగం పెండింగ్ ఉంది. ఇదేమి విజువల్ గ్రాండియర్, విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉన్న మూవీ కాదు కాబట్టి షూటింగ్ కు ఎక్కువ టైం అవసరం లేదు. సరే పెద్ది కోసం పోస్ట్ పోన్ చేశారని అనుకున్నా దానికి రెండు నెలల గ్యాప్ ఎందుకనేది అసలు క్వశ్చన్. పెద్ది బ్లాక్ బస్టర్ అయినా సరే మహా అయితే నెల రోజుల కంటే ఎక్కువ థియేటర్ రన్ ఉండదని, ఎలాగూ నాలుగు వారాల ఓటిటి అగ్రిమెంట్ చేసుకుని ఉంటారు కాబట్టి జూన్ మొదటివారానికి డిజిటల్ లో వచ్చేస్తుందని అఖిల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అలాంటప్పుడు లెనిన్ మే మధ్యలోనో చివరి వారంలోనో వదలకుండా ఇంత జాప్యం చేస్తూ, పైగా పెద్దిని సాకుగా చూపిస్తారా అంటూ నిలదీస్తున్నారు. సితార బ్యానర్ లో చాలా సినిమాలు ఇలా వాయిదాల పర్వంలో నలిగినవే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యం ఉంది కాబట్టి నాగార్జున ఎక్కువ డిలే లేకుండా చూస్తారని భావించారు. కానీ ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారని సిచువేషన్ చూస్తే అర్థమైపోతుంది.

వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన లెనిన్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రఫ్ పల్లెటూరి లుక్ లో అఖిల్ కొత్తగా ఉన్నాడు. ఆల్రెడీ రిలీజైన పాట మంచి బజ్ తెచ్చుకుంది. జూన్ మొదటి వారంలో టాక్సిక్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కాబట్టే లెనిన్ ని కాస్త దూరం తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రొడక్షన్ హౌస్ టాక్. ఏది ఏమైనా లెనిన్ బ్లాక్ బస్టర్ అవ్వాలనేది అందరి కోరిక. 

Related Post

ఒక్క విషయంలోనే భగత్ సింగ్ ఆందోళనఒక్క విషయంలోనే భగత్ సింగ్ ఆందోళన

దురంధర్ 2 రివెంజ్ ఏమైనా వాయిదా పడుతుందేమో, సోలో రిలీజ్ ఎంజాయ్ చేయొచ్చని భావించిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉదయం రణ్వీర్ సింగ్ బృందం షాక్ ఇచ్చింది. రేపు ట్రైలర్ లాంచ్ తో పాటు మార్చి 19 విడుదలలో ఎలాంటి మార్పు

Pinkvilla Recommendations: 7 Prithviraj Sukumaran films that you must watch at least once on OTTPinkvilla Recommendations: 7 Prithviraj Sukumaran films that you must watch at least once on OTT

Cast: Prithviraj Sukumaran, Jimmy Jean-Louis, KR Gokul, Amala Paul, Shobha Mohan, Talib Al Balushi Director: Blessy Language: Malayalam Genre: Survival Drama Runtime: 2 hours 53 minutes Where to watch: Netflix

హిట్టు జంటను క్యాష్ చేసుకుందామనుకుంటే..హిట్టు జంటను క్యాష్ చేసుకుందామనుకుంటే..

ఒక హిట్ సినిమాలో నటించిన జంటను రిపీట్ చేయడంలో తప్పు లేదు. వాళ్ళ మీద ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని వాడుకోవాలనుకోవడం రైటే. కానీ కేవలం కాంబోని తీసుకుని క్యాష్ చేసుకుందామని చూస్తే మాత్రం ముమ్మాటికీ రాంగ్ అవుతుంది. బ్యాండ్