hyderabadupdates.com movies అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకునే సిచువేషన్ వచ్చేసింది. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ వల్ల చాలా కేంద్రాల్లో ఇప్పటికే స్లోగా ఉన్న అఖండ 2 కలెక్షన్లు మరింత దెబ్బ తినబోతున్నాయి. గాయం మీద కారం చల్లినట్టు ఆల్రెడీ దురంధర్ ఎఫెక్ట్ ఉత్తరాది రాష్ట్రాల్లో  బలంగా తగిలింది. ఇప్పుడు రెండో వీకెండ్ వచ్చేసింది. మూమెంట్ తగ్గకుండా దర్శకుడు బోయపాటి శీను చాలా ట్రై చేస్తున్నారు. తనికెళ్ళ భరణి, సింగర్ సునీత లాంటి ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసి హైప్ పెంచాలని చూస్తున్నారు.

తాజాగా బాలయ్యతో పాటు బోయపాటి వారణాసికి వెళ్లిపోయారు. అక్కడ మీడియాని కలుసుకోవడంతో పాటు నిజమైన అఘోరాలతో సమావేశం కాబోతున్నట్టు తెలిసింది. సాధ్యమైతే వాళ్ళకో షో వేసి అభిప్రాయాలు తీసుకునే పనిలో ఉన్నారట. నిజానికి అఖండ 2  వసూళ్లు నార్త్ లో ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. కానీ కార్తికేయ 2, కాంతార రేంజ్ లో తమ సినిమా ఆడుతుందని భావించిన నిర్మాతలు అక్కడ విస్తృతంగా పబ్లిసిటీ చేశారు. కానీ దానికి భిన్నమైన రిజల్ట్ దక్కింది. అందుకే వీలైనంత పికప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడీ కాశి ట్రిప్ పెట్టుకున్నారు. ఇది ఎంత వరకు ఫలితం ఇస్తుందో చూడాలి.

వచ్చే వారం డిసెంబర్ 25 చాలా రిలీజులు క్యూ కట్టి ఉన్నాయి. ఆలోగా అఖండ 2 ఎంత రాబట్టుకుంటే అంత డ్యామేజ్ తగ్గుతుంది. ఏపీలో చాలా చోట్ల టికెట్ రేట్ల పెంపుని జిఓ ప్రకారం పది రోజుల పాటు కొనసాగిస్తూ ఉండటం చేటు చేస్తోంది. దీన్ని డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు గుర్తించకపోవడం ట్రాజెడీ. అవతార్ 3కి ఏమంత గొప్ప టాక్ రాకపోవడాన్ని అఖండ 2 ఏమైనా వినియోగించుకుంటుందేమో చూడాలి. 3డి వెర్షన్ తో కూడా పెద్దగా పనవ్వలేదు. ఫైనల్ గా అఖండ 2 నష్టం మిగులుస్తుందా లేక గట్టెక్కుతుందా అనేది ఇంకో నాలుగైదు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. అయితే బాలయ్య వేగానికి స్పీడ్ బ్రేకరయ్యేలా ఉంది.

Related Post

Modi Greets Rajinikanth on His 75th Birthday, Praises Five-Decade LegacyModi Greets Rajinikanth on His 75th Birthday, Praises Five-Decade Legacy

Prime Minister Narendra Modi extended warm wishes to superstar Rajinikanth on his 75th birthday, celebrating the legendary actor’s unmatched influence on Indian cinema. Modi said Rajinikanth’s performances have enthralled audiences

ఉస్తాద్ మీద ఇంత పెద్ద స్టేట్ మెంటాఉస్తాద్ మీద ఇంత పెద్ద స్టేట్ మెంటా

ఏపీలో కూటమి పాలన వచ్చాక పవన్ కళ్యాణ్ పెండింగ్ పడిపోయి అభిమానులకు తక్కువ నమ్మకం ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. తేరికి రీమేక్ అనే ప్రచారం కాస్త నెగటివ్ బజ్ తీసుకొచ్చిన మాట వాస్తవం. పైగా దర్శకుడు