hyderabadupdates.com Gallery అఖిల్ లెనిన్ ఫస్ట్ సింగిల్ కెవ్వు కేక

అఖిల్ లెనిన్ ఫస్ట్ సింగిల్ కెవ్వు కేక

అఖిల్ లెనిన్ ఫస్ట్ సింగిల్ కెవ్వు కేక post thumbnail image

హైద‌రాబాద్ : అఖిల్ అక్కినేని చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన చిత్రం లెనిన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్త‌యింది. తాజాగా సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రాణం పెట్టి సంగీతాన్ని అందించాడు ఎస్ఎస్ థ‌మ‌న్. దీనిని పూర్తిగా మ‌ధుర‌మైన మెలోడీగా తీర్చిదిద్దాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించాడు అఖిల్ అక్కినేని. వారే వా వారే వా పేరుతో పాట‌ను రూపొందించారు. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఇందులో క‌నిపిస్తుంది. సోమ‌వారం అధికారికంగా మూవీ మేక‌ర్స్ రొమాంటిక్ ట్రాక్ తో కూడిన సాంగ్ ను రిలీజ్ చేశారు.
విడుద‌లైన కొద్ది సేప‌టికే ట్రెండింగ్ లోకి వ‌చ్చేసింది. పిక్చ‌రైజేష‌న్ అద్భుతంగా ఉంది. పాట‌కు త‌గ్గ‌ట్టు హీరో, హీరోయిన్లు ప్ర‌క‌టించిన హావ‌భావాలు మ‌రింత హ‌త్తుకునేలా ఉన్నాయి. ఇది ఇప్పటికే సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. శ్వేతా మోహన్ , జుబిన్ నౌటియల్ అందంగా ఆలపించిన ఈ పాట, దాని హృద్యమైన గాత్రం , భావోద్వేగ లోతుతో ప్రత్యేకంగా నిలుస్తుంది. గీత రచయిత అనంత శ్రీరామ్ తన కవితాత్మక నైపుణ్యాన్ని జోడించాడు. పాటకు సంబంధించి రొమాంటిక్ ఆకర్షణను మరింత పెంచారు. ఈ పాట‌తో లెనిన్ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెంచేలా చేశాడు ద‌ర్శ‌కుడు.
ఇదిలా ఉండ‌గా ఈ వేసవిలో థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది ఈ మూవీ. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి , సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని , భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

The post అఖిల్ లెనిన్ ఫస్ట్ సింగిల్ కెవ్వు కేక appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఫాల్కన్ ఇన్వాయిస్ ఎండీ అమ‌ర్ దీప్ కుమార్ అరెస్ట్ఫాల్కన్ ఇన్వాయిస్ ఎండీ అమ‌ర్ దీప్ కుమార్ అరెస్ట్

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన రూ. 792 కోట్ల మోసానికి పాల్ప‌డిన ఫాల్కాన్ ఇన్ వాయిస్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ అమ‌ర్ దీప్ కుమార్ ను మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ సీఐడీ చీఫ్ చారు సిన్హా అరెస్ట్ చేశారు. ఈ

Minister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనMinister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

Nara Lokesh : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈనెల 19 నుంచి 24 వరకు అంటే ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్

Maharashtra: అవినీతిలో అగ్రస్థానంలో మహారాష్ట్ర !Maharashtra: అవినీతిలో అగ్రస్థానంలో మహారాష్ట్ర !

    దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 795 కేసులు నమోదయ్యాయి.