హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కావాలని తమను ఇబ్బంది పెట్టే పోలీసు ఉన్నతాధికారులపై భగ్గుమన్నారు. వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆరోజు మీరు ఎక్కడున్నా, ఏ మూల దాక్కున్నా వదిలి పెట్ట బబోమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను ఇవాళ విచారణ పేరుతో సిట్ విచారణకు పిలవడంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పోలీసులకు స్ట్రాంగ్ వార్నంగ్ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ కావాలని రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్న అధికారులతో సిట్ ఏర్పాటు చేసి మామల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వకంగా రేవంత్ రెడ్డి మాటలు, మీ సీపీ మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే అధికారులను వదిలిపెట్టమన్నారు.
రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా రప్పించి తీరుతామని అన్నారు హరీశ్ రావు.
ఇదిలా ఉండగా కేటీఆర్ ను విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ జూబ్లీహిల్స్‌లో రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, క్రాంతి కిరణ్, ఇతర బీఆర్ఎస్ నాయకులను అడ్డు కోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారని, ఇదే కేసులో రేవంత్ రెడ్డిని కూడా విచారించాలని డిమాండ్ చేశారు తన్నీరు హరీశ్ రావు. కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న ఖాకీలు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
The post అధికారంలోకి వస్తాం ఇబ్బంది పెట్టిన వాళ్లను వదలం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
అధికారంలోకి వస్తాం ఇబ్బంది పెట్టిన వాళ్లను వదలం
Categories: