hyderabadupdates.com movies అనిల్ యానిమేషన్ మూవీ భవిష్యత్ కోసమా

అనిల్ యానిమేషన్ మూవీ భవిష్యత్ కోసమా

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం  సబబు కాకపోయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ సృష్టించేది సక్సెసే కాబట్టి ఇద్దరినీ ఒక వరసలో చూడాల్సి ఉంటుంది. మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఆనందంలో ఉన్న అనిల్ త్వరలోనే వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ పనులు చివరి దశకు వచ్చాయని సమాచారం.

ఒక షాకింగ్ అప్డేట్ ఏంటంటే అనిల్ రావిపూడి త్వరలో ఒక యానిమేషన్ ప్రాజెక్టు మీద వర్క్ చేయబోతున్నారట. జన నాయకుడు, టాక్సిక్, కేడి ది డెవిల్, చిరంజీవి – బాబీ సినిమాల నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇది రూపొందుతుందని ఇన్ సైడ్ టాక్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ పనులైతే మొదలవ్వొచ్చని అంటున్నారు. కాకపోతే అనిల్ రెగ్యులర్ స్టైల్ లో ఫాస్ట్ గా అవ్వదు. ఓ రెండు సంవత్సరాలు టైం పట్టొచ్చని టాక్.

కెరీర్ ఇంత దివ్యంగా ఉన్న టైంలో యానిమేషన్ ఎందుకనే అనుమానం సహజం. దానికి సమాధానం భవిష్యత్తు విజన్ అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రాఫిక్స్ మొదలైనవి మూవీ మేకింగ్ లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఆర్టిస్టులే లేకుండా కేవలం యానిమేషన్ తో తీసిన మహావతార్ నరసింహ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో చూశాం. అవతార్ లో మనం చూసేది సగం నిజం, సగం విజువల్ మాయ.

ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి ఇందులో కూడా ఒక ప్రయత్నం చేసి చూద్దాం అనుకుని ఉండొచ్చు. యానిమేషన్ లో పరిమితులు హద్దులు ఉండవు. మనకు కావాల్సింది రావాల్సిన రీతిలో చక్కగా రాబట్టుకోవచ్చు. సరైన టీమ్ దొరకాలి అంతే. ముఖ్యంగా సూపర్ హీరోల కథలు, లార్జర్ థాన్ లైఫ్ స్టోరీలకు ఇది చాలా బాగుంటుంది. అందుకే అనిల్ రావిపూడి ఇది కూడా ట్రై చేద్దామని అనుకుని ఉండొచ్చు. కెవిఎన్ అంటే మేకింగ్ పరంగా ఎలాంటి రాజీ  ఉండదు.

అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది హాట్ టాపిక్ గానే చూడాలి. నిజమైతే మాత్రం ఈ జానర్ లో అడుగు పెడుతున్న టయర్ 1 దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అలాని తన రెగ్యులర్ స్టయిల్ సినిమాలు పక్కన పెడతాడని అనుకోలేం. ఆ అవసరం రాదు కూడా. చక్కగా బాలన్స్ చేసుకోవచ్చు. తనకు సంబంధించి ఏదైనా న్యూస్ వస్తే వెంటనే స్పందించే అనిల్ మరిప్పుడు ఈ యానిమేషన్ టాక్ గురించి ఏమంటారో చూద్దాం.

Related Post

The Girlfriend: Trailer of Rashmika Mandanna’s film to be out on this dateThe Girlfriend: Trailer of Rashmika Mandanna’s film to be out on this date

Rashmika Mandanna’s latest Bollywood outing Thamma is off to a solid start at the box office. The actress left audiences enthralled with her powerful portrayal in a challenging role and

వైసీపీ కార్యాల‌యంలో `సంక్రాంతి` ర‌ద్దు?వైసీపీ కార్యాల‌యంలో `సంక్రాంతి` ర‌ద్దు?

గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఏటా నిర్వ‌హించే సంక్రాంతి సంబ‌రాల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి గ‌త ఏడాది కూడా తూతూ.. మంత్రంగా నిర్వ‌హించారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మాత్రం ఘ‌నంగా ఈ సంబ‌రాల‌ను తాడేప‌ల్లి నివాసంలో