hyderabadupdates.com movies అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్

అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్

అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్ post thumbnail image

వరసగా తొమ్మిదో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మేఘాల్లో తేలిపోతున్నారు. సక్సెస్ ఊహించిందే అయినా మరీ ఇలా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో విజయం సాధిస్తుందని ట్రైలర్ వచ్చినప్పుడు అభిమానులే అనుకోలేదు.

కాంపిటీషన్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే మెగా సింహాసనం నాదే అంటూ చిరంజీవి సాగిస్తున్న బాక్సాఫీస్ వేట అంత ఈజీగా ఆగేలా లేదు. ఈ క్రెడిట్ లో సింహభాగం రావిపూడికే దక్కుతుంది. అయితే తన నెక్స్ట్ మూవీ ఏదనే ఎగ్జైట్ మెంట్ మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. దానికి సమాధానం నేరుగా కాదు కానీ ఇన్ డైరెక్ట్ గా తాజా ఇంటర్వ్యూలో దొరికింది.

మన శంకరవరప్రసాద్ విక్టరీని సెలెబ్రేట్ చేసుకోవడానికి చిరు, వెంకీ, రావిపూడి కలిసి మెగాస్టార్ ఇంట్లో ఒక స్పెషల్ పార్టీ చేసుకుని సరదా ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఎన్నో సరదా కబుర్లు అందులో దొర్లాయి.

చివర్లో చిరంజీవి మాట్లాడుతూ వెంకటేష్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి కనక తనకు ఏదైనా క్యామియో ఆఫర్ చేసినా లేదా ఫుల్ లెన్త్ రోల్స్ తో ఇద్దరినీ బ్యాలన్స్ చేసేలా కథ రాసుకుని వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించేశారు. దానికి పక్కనే ఉన్న వెంకీ కూడా సానుకూలంగా స్పందించడంతో నిప్పు లేనిదే పొగరాదు సామెత గుర్తుకు వస్తోంది. ఏదో హింట్ లేనిదే చిరు అలా మాట్లాడరు కదా.

ఆదర్శ కుటుంబం, దృశ్యం 3 తర్వాత వెంకటేష్ చేయబోయే మూవీ అనిల్ రావిపూడితోనే అన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుస. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ని సీరియస్ గా ప్లాన్ చేస్తున్నారనే లీక్ కొన్ని వారాలుగా చక్కర్లు కొడుతోంది. అయితే అనిల్ దాని ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఒకవేళ నిజమే అయిన పక్షంలో సంక్రాంతికి వస్తున్నాం 2లో మెగా స్పెషల్ అప్పియరెన్స్ చూసే ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పటికైతే దీన్ని ముందస్తు ఊహాగానాలు అనుకోవచ్చు కానీ నిజమైనా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. చిరంజీవికి అంత గొప్ప మైలురాయిని రావిపూడి కానుకగా ఇచ్చాడు మరి. 

#Chiranjeevi as lead, #Venkatesh’s cameo – Venkatesh as lead, Chiranjeevi’s cameo – Multistarrer pic.twitter.com/IeaOeTuZui— Gulte (@GulteOfficial) January 15, 2026

Related Post

మాస్ బలం తెలుసుకోండి రాజామాస్ బలం తెలుసుకోండి రాజా

గత నెలాఖరున విడుదలైన మాస్ జాతర యూనానిమస్ ఫెయిల్యూర్ అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరీ రొటీన్ కంటెంట్ తో దర్శకుడు భాను భోగవరపు తనకు దక్కిన తొలి అవకాశాన్ని వృథా చేసుకున్నాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ధమాకా స్థాయిలో రవితేజ,

టికెట్ రేట్ల జీవోపై మ‌ళ్లీ కొత్త మాట‌టికెట్ రేట్ల జీవోపై మ‌ళ్లీ కొత్త మాట‌

తెలంగాణ‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు వ్య‌వ‌హారం ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పై టికెట్ల రేట్లు పెంచ‌బోమ‌ని ఒక‌టికి రెండుసార్లు నొక్కి వ‌క్కాణించారు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఐతే ఇటీవ‌ల సంక్రాంతి సినిమాల‌కు మ‌ళ్లీ రేట్లు