hyderabadupdates.com movies అనిల్ రావిపూడి పంచ్ ఎవరిమీదబ్బా

అనిల్ రావిపూడి పంచ్ ఎవరిమీదబ్బా

దర్శకుడు అనిల్ రావిపూడి లుక్స్, చలాకీతనం హీరోగా చేయడానికి పనికొచ్చేలా ఉంటాయి. పైగా డాన్స్ కూడా బాగా వచ్చు. రియాలిటీ షోలు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు జడ్జ్ గా వచ్చిన అనిల్ టాలెంట్ తెలిసే ఉంటుంది. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారి మీరు హీరోగా ఎప్పుడు చేస్తారని యాంకర్లు అడుగుతూ ఉంటారు.

ఇవాళ గుంటూరులో జరిగిన మెగా విక్టరీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మరోసారి ఈ ప్రస్తావన వచ్చింది. దానికి అనిల్ సమాధానం చెబుతూ మనం సక్సెస్ ట్రాక్ లో ఉన్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయని, పక్కకు వెళ్ళామా అంతే సంగతులంటూ, ఇప్పట్లో ఆ ఆలోచన లేదని కుండబద్దలు కొట్టారు.

ఇక్కడ అనిల్ ఎవరినీ ఉద్దేశించి అనకపోయినా ఇటీవలే లోకేష్ కనగరాజ్ హీరోగా మారిన వైనాన్ని గుర్తు చేసుకోవాలి. దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ ఉన్నా సరే కూలి తర్వాత సోలో హీరోగా వేరే దర్శకుడితో ఒక మూవీ చేస్తున్నాడు. పెద్ద బడ్జెటే పెడుతున్నారు.

గతంలో ఎస్వి కృష్ణారెడ్డి భీకరమైన ఫామ్ లో ఉన్నప్పుడు హీరోగా ట్రై చేద్దామని ఉగాది, అభిషేకం చేస్తే రెండూ ఫెయిలయ్యాయి. తర్వాత మళ్ళీ మేకప్ జోలికి వెళ్లకుండా డైరెక్షన్ కు పరిమితమయ్యారు. కానీ మునుపటి స్పీడ్ అందుకోలేకపోయారు. వివి వినాయక్ తో ఇలాంటి ప్రయత్నమే దిల్ రాజు చేయబోయి శీనయ్య అంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చాక ఆపేశారు.

ఇప్పుడు అనిల్ రావిపూడి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని తెలివిగా ఆ ట్రాప్ లో పడకుండా కేవలం దర్శకుడిగా పరిమితం కావడం మంచి నిర్ణయం. ఎందుకంటే డైరెక్టర్ గా ఎంత క్రేజ్ ఉన్నా మేకప్ వేసుకుని తెరపైకి వస్తే లెక్కలు మారిపోతాయి.

అందుకే రాజమౌళి, శంకర్ లాంటి వాళ్ళు ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా పొరపాటున కూడా కెమెరా ముందుకు వచ్చే సాహసం చేయలేదు. ఏవో చిన్న ప్రోమో వీడియోలు, క్యామియో లు యాడ్స్ మినహాయించి వాటి జోలికి వెళ్ళలేదు. ఇదంతా ఓకే కానీ మన శంకరవరప్రసాద్ గారుతో తన సక్సెస్ ట్రాక్ ని కొనసాగించాల్సిన పెద్ద బాధ్యత రావిపూడి మీద ఉంది. అది కూడా పెద్ద కాంపిటీషన్ మధ్య.

Related Post

సాయికుమార్ పుత్రోత్సాహం ఈసారి తీరుతుందాసాయికుమార్ పుత్రోత్సాహం ఈసారి తీరుతుందా

క్రిస్మస్ కు విడుదల కాబోతున్న సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటోంది. స్టార్ హీరోలు ఎవరూ లేకపోయినా కంటెంట్ల మధ్య యుద్ధంగా దీని గురించి బయ్యర్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆది సాయికుమార్ శంభాల విడుదలకు ముందే ఓటిటి డీల్

తెలంగాణ అసెంబ్లీలో ‘బాంబుల’ గోలతెలంగాణ అసెంబ్లీలో ‘బాంబుల’ గోల

మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్‌లో పలు పిల్లర్లు కుంగిన వైనం తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికలకు ముందు చెలరేగిన రాజకీయ దుమారం ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రభావం

కేటీఆర్ ఫ‌స్ట్ టైమ్‌: పేద‌లు-బాధితుల‌తో కలిసి దీపావళి!కేటీఆర్ ఫ‌స్ట్ టైమ్‌: పేద‌లు-బాధితుల‌తో కలిసి దీపావళి!

రాజ‌కీయాల్లో నాయ‌కులు ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డ‌తార‌న్న‌ది తెలిసిందే. అవ‌కాశం-అవ‌స‌రం అనే రెండు ప‌ట్టాల‌పైనే రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో గ‌తానికి భిన్నంగా బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌.. పేద‌లు.. హైడ్రా బాధితుల‌తో క‌లిసి తాజాగా దీపావ‌ళిని