hyderabadupdates.com movies అనిల్ సర్ప్రైజ్… దగ్గుబాటి + నందమూరి

అనిల్ సర్ప్రైజ్… దగ్గుబాటి + నందమూరి

దర్శకుడు అనిల్ రావిపూడి అందరి అంచనాలకు ఝలక్ ఇస్తూ తన కొత్త సినిమా ప్రకటన ఇచ్చేశారు. హీరో వెంకటేష్ తో పాటు మరో కథానాయకుడు ఎవరనే సస్పెన్స్ గురించి గత కొన్ని రోజులుగా చాలా లీకులు వచ్చాయి. ముఖ్యంగా ఫహద్ ఫాసిల్, కార్తీ పేర్లు బలంగా వినిపించాయి.

అయితే నిజంగా సంప్రదింపులు జరిగాయో లేక ఏదైనా కారణాల వల్ల వద్దనుకున్నారో ఏమో కానీ ఫైనల్ గా నందమూరి కళ్యాణ్ రామ్ లాక్ కావడం ఎవరూ అనుకోని కొత్త ట్విస్టు. అనిల్ రావిపూడిని నమ్మి పటాస్ రూపంలో తొలి అవకాశం ఇచ్చింది కళ్యాణ్ రామే. డెబ్యూతోనే సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది ఈ కాంబో.

తర్వాత ఈ కలయిక మళ్ళీ సాధ్యపడలేదు. పటాస్ 2 కోసం అప్పుడప్పుడు అభిమానులు డిమాండ్ చేస్తున్నా అప్పటికే అనిల్ రావిపూడి పూర్తిగా ఫన్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చేతులు కలపడం విశేషమే. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఆన్ స్క్రీన్ కాంబో డిఫరెంట్ గా ఉండబోతోందనేది అర్థమవుతోంది.

ఎక్కువ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ కళ్యాణ్ రామ్ కామెడీ కూడా పండించగలడని కొన్ని శాంపిల్స్ పటాస్ లో చూపించాడు అనిల్ రావిపూడి. తర్వాత ఈ యాంగిల్ ఇతర దర్శకులు వాడుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పుడు తిరిగి ఇంకో ఛాన్స్ వచ్చేసింది.

అనుకున్నట్టే 2027 సంక్రాంతి విడుదలని అఫీషియల్ గా ప్రకటించారు. ఒక్కసారి అనౌన్స్ చేశాక ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మిస్ కాకుండా చూసుకోవడం అనిల్ రావిపూడికు మాత్రమే సాధ్యమైన విద్య. సో ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. దీనికి చాలా పొడవైన టైటిల్ లాక్ చేశారని తెలిసింది.

ఇప్పటికిప్పుడు దీన్ని ప్రకటించకపోవచ్చు కానీ సరైన సందర్భం చూసి రివీల్ చేస్తారు కానీ కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ వచ్చినా లీకుల ప్రకారం ఇందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బావమరిదిగా కనిపించబోతున్నారు. ఈ ఇద్దరు ప్లస్ భార్యల మధ్య కామెడీ ప్రధాన హైలైట్ గా ఉంటుందని  చెబుతున్నారు.

Related Post

వైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బాబు అసంతృప్తివైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బాబు అసంతృప్తి

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ శ్రేణులను పక్కనబెట్టి కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వారికి కొందరు ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్షేత్రస్థాయి నుంచి

మొన్న బాబు, నిన్న లోకేష్, నేడు నారా భువనేశ్వరిమొన్న బాబు, నిన్న లోకేష్, నేడు నారా భువనేశ్వరి

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ త‌ర‌చుగా ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.. వారి విజ్ఞాప‌న‌ల‌పై స్పందిస్తున్నారు. ఇటీవ‌ల మంత్రి నారా లోకేష్.. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యాని కి వెళ్లి  ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించిన‌ప్పుడు.. సుమారు 4