hyderabadupdates.com movies అన్వేషణను అరెస్టు చేస్తారా?

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని సమాచారం. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 352, 79, 299తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేశారు. ఇటీవల అన్వేష్ ప్రధాన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ బ్లాక్ చేసింది. దాదాపు 13 లక్షల ఫాలోవర్లు ఉన్న ఆ ఖాతాలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న కంటెంట్‌పై ఫిర్యాదులు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

అకౌంట్ తొలగింపుకు ప్రతిస్పందనగా అన్వేష్ అసభ్య పదజాలంతో వీడియో విడుదల చేయడం వివాదానికి దారితీసింది. పోలీసులను, వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి.

అన్వేష్‌కు మరిన్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని ఆయన స్వయంగా ప్రకటించడంతో, వాటి వివరాలు సేకరించేందుకు పోలీసులు మెటా, యూట్యూబ్ సంస్థలకు అధికారిక లేఖలు రాయాలని నిర్ణయించారు.

లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం వల్ల అన్వేష్ విదేశాల నుంచి భారత్‌కు చేరుకున్న వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం అందుతుంది. తద్వారా ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

విచారణకు సహకరించడం లేదనే అభిప్రాయంతోనే పోలీసులు ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. పోలీసులు తదుపరి చర్యలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Post

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. మహానుభావుడు, ఎఫ్-2 లాంటి హిట్లూ పడ్డాయి. కానీ ఒక దశ దాటాక వరుస ఫ్లాపులు రావడంతో ఆమె

టైసన్ నాయుడుకి మోక్షం దొరికేదెలాటైసన్ నాయుడుకి మోక్షం దొరికేదెలా

అల్లుడు అదుర్స్ తర్వాత ఛత్రపతి హిందీ రీమేక్ కోసం చాలా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ గత ఏడాది భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది ఆశించిన ఫలితం అందుకోకపోయినా, అనుకున్న దాని కన్నా ఎక్కువగా కిష్కిందపురి వర్కవుట్