hyderabadupdates.com movies అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ… ఎవరీ న‌త్వానీ?

అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ… ఎవరీ న‌త్వానీ?

ప‌రిమ‌ళ్ న‌త్వానీ. ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ, ఈయ‌న పెద్ద పారిశ్రామిక వేత్త‌. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఈయ‌న పేరు అంద‌రికీ తెలుసు. ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌, జియో అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత ప్రియ మిత్రుడు. ఆటోమేటిక్‌గా ప్ర‌ధాని మోడీకి కూడా ఆయ‌న విశ్వాస‌పాత్రుడు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. గ‌తంలో ప్ర‌ధాని సూచ‌న‌ల మేర‌కు.. బీజేపీ కోరిక మేర‌కు.. వైసీపీ న‌త్వానీకి.. రాజ్య‌స‌భ సీటు ఇచ్చేసింది. త‌ద్వారా ఆయ‌న రాజ్య‌స‌భ‌లో స‌భ్యుడ‌య్యారు.

అయితే.. ఈ ఏడాది జూన్‌తో న‌లుగురు స‌భ్యుల ప‌ద‌వీ కాలం పూర్తికానుంది. వీరిలో న‌త్వానీ కూడా ఉన్నారు. అప్ప‌ట్లో వైసీపీ న‌త్వానీకి టికెట్ ఇచ్చిన‌ప్పుడు.. సాయిరెడ్డి వంటివారు.. ఒక ప్ర‌చారం చేశారు. తాము పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని..తద్వారా ఏపీకి పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. పారిశ్రామిక వేత్త‌ల‌కు వైసీపీ వ్య‌తిరేకం కాద‌ని చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత‌.. న‌త్వానీ.. వైసీపీ త‌ర‌ఫున గ‌ళం ఒక‌టి రెండు సార్లు వినిపించారు.

ఇక‌, ఇప్పుడు న‌త్వానీ ప‌ద‌వీ కాలం పూర్త‌వుతుండ‌డంతో ఆయ‌న‌ను మ‌రోసారి స‌భ‌కు పంపించాల‌న్న‌ది బీజేపీ వ్యూహం. అయితే.. ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ జోక్యం చేసుకుంద‌ని స‌మాచారం. తాజాగా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లో కూడా న‌త్వానీ పేరు వినిపించింద‌ని తెలిసింది. ఆయ‌న‌ను కొన‌సాగించాల‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. వైసీపీ త‌ర‌ఫున గ‌తంలో స‌భ‌కు వెళ్లినా.. ఇప్పుడు టీడీపీ త‌ర‌ఫున పంపించాల్సి ఉంటుంద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

కార‌ణం ఇదే..పారిశ్రామిక వేత్త‌ల‌కు పెద్ద‌పీట వేస్తున్న సీఎం చంద్ర‌బాబు.. న‌త్వానీకి మ‌రోసారి స‌భ్య‌త్వం ఇవ్వ‌డం ద్వారా.. పారిశ్రామిక వేత్త‌ల విష‌యంలో త‌న దృక్ఫ‌థాన్ని వెల్ల‌డించాల‌ని నిర్న‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో ఉత్త‌రాదిలోనూ.. త‌న పేరును మ‌రింత ప‌టిష్టం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

న‌త్వానీకి ఇప్పుడు అవ‌కాశం ఇస్తే.. అది జాతీయ స్థాయిలో మ‌రింత ప్ర‌చారానికి అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌ద్వారా.. పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్ర‌భుత్వం రెడ్ కార్పెట్ వేస్తోంద‌న్న భావ‌న వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు. పార్టీల‌కు అతీతంగా న‌త్వానీని రెన్యువ‌ల్ చేయ‌డం ద్వారా.. పారిశ్రామిక పుర‌గ‌తికి అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారట‌.

Related Post

‘డెత్ సెల్‌’లో ఇమ్రాన్‌.. పాక్ ర‌ణ‌రంగం!‘డెత్ సెల్‌’లో ఇమ్రాన్‌.. పాక్ ర‌ణ‌రంగం!

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని, ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ మృతి చెందిన‌ట్టు గ‌ట్టి న‌మ్మ‌కం ఏర్ప‌డుతోంద‌ని ఆయ‌న కుమారులు సులేమాన్‌, ఖాసీంలు పేర్కొన‌డంతో పాకిస్థాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. ఇమ్రాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్ర‌భుత్వం